2023 Kawasaki Z900 Launched। సరికొత్తగా ముస్తాబై వచ్చిన కవాసకి రోడ్‌స్టర్ బైక్!
జపనీస్ బైక్ మేకర్ కవాసకి భారత మార్కెట్లో 2023 Kawasaki Z900 బైక్‌ను విడుదల చేసింది. దీని ధర 2023 Ninja ZX-10R స్పోర్ట్స్‌బైక్ కంటే తక్కువే. వివరాలు చూడండి.
స్పోర్ట్స్ బైక్ మేకర్ కవాసకి భారత మార్కెట్లో 2023 Kawasaki Ninja ZX-10R స్పోర్ట్స్‌బైక్‌తో పాటుగా మరొక మోడల్ 2023 Kawasaki Z900 బైక్‌ను విడుదల చేసింది. ఈ రోడ్‌స్టర్ బైక్ ధర ఎక్స్- షోరూం వద్ద రూ. 8.93 లక్షలుగా ఉంది. ZX-10R బైక్ లాగే ఈ 2023 Z900 మోడల్ కూడా యాంత్రికంగా ఎలాంటి మార్పులను పొందలేదు. కేవలం కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లకు మాత్రమే పరిమితం అయింది. కానీ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే రూ. 51,000 ఖరీదైనది.
2023 Kawasaki Z900 బైక్ ఇప్పుడు రెండు కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ థీమ్‌లలో లభించనుంది. అందులో ఒకటి 'మెటాలిక్ ఫాంటమ్ సిల్వర్ విత్ మెటాలిక్ కార్బన్ గ్రే' కలర్ వేరియంట్ కాగా, మరొకటి 'ఎబోనీ విత్ మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే' కలర్ వేరియంట్. అయితే రెండు కలర్ వేరియంట్లు ఒకే ధరకు అందుబాటులో ఉంటాయి.
2023 Kawasaki Z900 ఇంజన్ స్పెసిఫికేషన్లు
సరికొత్త కవాసకి Z900 మోటార్‌సైకిల్‌లో BS6-అనుగుణమైన 948cc సామర్థ్యం కలిగిన ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 9,500rpm వద్ద 123.6bhp శక్తిని అలాగే 7,700rpm వద్ద 98.6Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేశారు.
2023 Kawasaki Z900 ఫీచర్లు
2023 Kawasaki Z900 బైక్ స్టైలింగ్, ఫీచర్ లిస్ట్ కూడా ఏం మారలేదు. ఇందులోనూ మునుపటి వెర్షన్ రోడ్‌స్టర్ బైక్ మోడల్ లో ఉన్నట్లుగానే ఫీచర్లు ఉంటాయి. 2023 Z900 సుగోమి-డిజైన్‌తో వచ్చింది. స్టైలింగ్ ఎలిమెంట్స్‌లో గంభీరమైన హెడ్‌లైట్, ష్రౌడ్స్‌తో కూడిన దృఢమైన ఫ్యూయల్ ట్యాంక్, స్టెప్-అప్ సీట్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్ ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, పవర్ మోడ్‌లు, రైడింగ్ మోడ్‌లు, ABS ఉన్నాయి. ఇంకా పూర్తి-LED లైటింగ్, బ్లూటూత్- కనెక్టివిటీ కలిగిన కలర్ TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
కవాసకి Z900 బైక్ భారత రోడ్లపై డుకాటి మాన్‌స్టర్, BMW F900R, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ శ్రేణి వంటి వాటి మోటార్‌సైకిళ్లతో పోటీ పడుతుంది.
సంబంధిత కథనం
టాపిక్