Bigg Boss Yashmi: యష్మికి నామినేషన్ల మోత మోగించిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు.. మణి విషయంలో మళ్లీ ఓవర్ యాక్షన్
Bigg Boss 8 Telugu Yashmi: ఈ వారం నామినేషన్లలో యష్మి గౌడను టార్గెట్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు. ఆమెను ఎక్కువ మంది నామినేట్ చేశారు. నాగ మణికంఠ విషయంలో యష్మి మళ్లీ ఓవర్ యాక్షన్ చేశారు. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
బిగ్‍బాస్ 8 తెలుగు హౌస్‍లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టడంతో పోరు ఆసక్తికరంగా మారిపోయింది. గత సీజన్లలో ఆడిన ఎనిమిది మంది హౌస్‍లోకి వచ్చి రాయన్ క్లాన్‍గా ఏర్పడ్డారు. అప్పటికే ఉన్న ఎనిమిది మంది ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్స్ (ఓజీ) క్లాన్‍గా ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక నేడు (అక్టోబర్ 7) తొలిసారి నామినేషన్లు జరిగాయి. ఆరో వారంలో నామినేషన్ల ప్రక్రియ సాగింది.
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ మరోసారి వెల్‍కమ్ చెప్పారు. మణికంఠ ఏడ్వడంపై గంగవ్వ పంచ్‍లు వేశారు. ఇంట్లో వాళ్లను గుర్తు చేసుకొని ఏడిస్తే బయటికి పో అంటూ చెప్పారు. దీంతో తాను ఏడ్వను అని మణి చెప్పారు.
మడత పెట్టి పాటతో 36వ రోజు మొదలైంది. చాలెంజ్ గెలువడం ద్వారా రేషన్ కంట్రోల్ ప్రస్తుతం ఓజీ క్లాన్ చేతిలో ఉంది. దీనిపై హరితేజతో పాటు కొందరు రాయల్ క్లాన్ సభ్యులు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓజీ క్లాన్ వారు తమతో కలవడం లేదని మాట్లాడారు.
యష్మి టార్గెట్‍గా..
ఓజీ క్లాన్ సభ్యుల ఆటను వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వచ్చిన రాయల్ క్లాన్ సభ్యులు ఇంతకాలం బయటి నుంచి చూశారని బిగ్‍బాస్ చెప్పారు. హౌస్‍లో ఉండేందుకు ఎవరికి అర్హత లేదనుకునే ఇద్దరు ఓజీ క్లాన్ సభ్యులను నామినేట్ చేయాలని రాయల్ క్లాన్‍కు బిగ్‍బాస్ చెప్పారు. కారణాలు చెప్పి మెడలో నామినేషన్ బోర్డ్ మెడలో వేయాలని అన్నారు. మెగా చీఫ్ అయిన నబీల్‍ను నామినేషన్ల నుంచి పక్కన పెట్టారు.
ముందుగా యష్మి గౌడను హరితేజ నామినేట్ చేశారు. ఒక్కొక్కరిని ఒక్కోలా యష్మి చూస్తున్నారని, ఒకరినే టార్గెట్ చేస్తున్నారంటూ మణికంఠ విషయాన్ని గుర్తు చేశారు. యష్మి కూడా గట్టిగా డిఫెండ్ చేసుకున్నారు. పృథ్విని కూడా హరితేజ నామినేట్ చేశారు.
మణి విషయంలో గౌతమ్
విష్ణుప్రియతో పాటు యష్మిని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశారు. మణికంఠపై రివేంజ్ నామినేషన్లు వేయడం కరెక్ట్ కాదని యష్మితో చెప్పారు. మణిని చాలాసార్లు బాధపెట్టారని గుర్తు చేశారు. అయితే, తాను మణిని చాలాసార్లు ఓదార్చానని యష్మి ఏదో చెప్పారు.
విష్ణును నయని పావని నామినేట్ చేశారు. ఛీప్ కావడం ఇష్టలేదని విష్ణు చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. సీతను కూడా ఆమె నామినేట్ చేశారు. సీతతో పాటు యష్మిని నామినేట్ చేశారు మహబూబ్. తమతో యష్మి సరిగా మాట్లాడడం లేదని చెప్పారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన తమను అంగీకరించినట్టు కనిపించడం లేదని తెలిపారు.
సీత, మణికంఠను టేస్టీ తేజ నామినేట్ చేశారు. మణికంఠ సమస్యలు ఎక్కువసార్లు చెబుతూ ఏడుస్తున్నారని అన్నారు. గుడ్ గేమర్ అంటూనే ఎమోషనల్ అవొద్దని చెప్పారు.
యష్మికి నామినేషన్ల మోత
నామినేషన్ల ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆరుగురిలో నలుగురు యష్మిని నామినేట్ చేశారు. కారణాలు చెప్పి యష్మిపై కారణాల మోత మోగించారు. యష్మి కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. గంగవ్వ, రోహిణి, అవినాష్ ఇంకా నామినేషన్లు చేయాల్సి ఉంది. అయితే, వీరు కూడా యష్మిని నామినేట్ చేసినట్టు లీకుల ద్వారా వెల్లడైంది. మొత్తంగా 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో ఆరుగురు యష్మినే నామినేట్ చేసినట్టు అవుతుంది. నామినేషన్లలో ఎవరెవరు ఉంటారన్నది రేపు పూర్తిగా క్లారిటీ రానుంది. మణికంఠకు వైల్డ్ కాల్డ్ రాయల్ క్లాన్ బాగా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించింది.
యష్మి ఓవర్ యాక్షన్.. నెటిజన్ల ఫైర్
మణికంఠను టేస్టీ తేజ నామినేట్ చేసిన సమయంలో యష్మి కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. మణిని నామినేట్ చేయగా.. నవ్వుతూ గట్టిగా చేతులను కొట్టారు. విష్ణుప్రియకు హైఫై ఇచ్చారు. దీంతో మూడో ఆప్షన్ ఉంటే నిన్నే నామినేట్ చేసేవాడినని తేజ పంచ్ వేశారు. ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ యష్మికి కౌంటర్ ఇచ్చారు గౌతమ్ కృష్ణ. మణిని నామినేట్ చేస్తే ఎందుకు అంత ఓవర్ యాక్షన్ అంటూ నెటిజన్లు యష్మిని ట్రోల్ చేస్తున్నారు. మణి విషయంలో సైకోలా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.