Weekend OTT Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. చాలానే ఉన్నాయ్-weekend ott releases in netflix prime video disney plus hotstar jio cinema sonyliv aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weekend Ott Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. చాలానే ఉన్నాయ్

Weekend OTT Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. చాలానే ఉన్నాయ్

Hari Prasad S HT Telugu
Jun 06, 2024 10:15 PM IST

Weekend OTT Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడటానికి చాలానే సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేయగా.. మరికొన్ని శుక్రవారం (జూన్ 7) రాబోతున్నాయి.

ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. చాలానే ఉన్నాయ్
ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. చాలానే ఉన్నాయ్

Weekend OTT Releases: వీకెండ్ ఓటీటీల్లో ఏం చూడాలో తేల్చుకోలేకపోతున్నారా? ఇక్కడ ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ ల పూర్తి వివరాలు ఉన్నాయి. ఏ ఓటీటీల్లో ఏ సినిమా, వెబ్ సిరీస్ ఉందో తెలుసుకోండి. వీకెండ్ పక్కాగా ప్లాన్ చేసుకొని వాటిని చూసేయండి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జియో సినిమాలాంటి ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి.

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

బడే మియా చోటే మియా - నెట్‌ఫ్లిక్స్

బాలీవుడ్ లో ఈ ఏడాది భారీ బడ్జెట్ తో రిలీజై తీవ్రంగా నిరాశ పరిచిన మూవీ బడే మియా చోటే మియా. ఈ సినిమా గురువారం (జూన్ 6) నుంచే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ సినిమాను వీకెండ్ చూసేయండి.

బ్లాకౌట్ - జియో సినిమా

ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సీ నటించిన మూవీ బ్లాకౌట్. ఈ మధ్యే 12th ఫెయిల్ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న అతడు.. ఈసారి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం (జూన్ 7) నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

గుల్లక్ సీజన్ 4 వెబ్ సిరీస్ - సోనీలివ్

సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ గుల్లక్ సీజన్ 4 ఓటీటీలోకి వచ్చేసింది. ఈ కొత్త సీజన్ గురువారం (జూన్ 6) నుంచి సోనీలివ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మిశ్రా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ కొత్త సీజన్ లో అందించబోయే వినోదాన్ని ఎంజాయ్ చేయండి.

వర్షంగల్కు శేషమ్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ మలయాళం మూవీ వర్షంగల్కు శేషమ్. సినిమాల్లో సెటిలవ్వాలని కలలు కనే ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరిగే కథే ఈ సినిమా. ఈ ఏడాది రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 7) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి వస్తోంది.

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ - హాట్‌స్టార్

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4 కూడా ఈ వారమే హాట్‌స్టార్ లోకి వస్తోంది. ఈ యానిమేటెడ్ సిరీస్ కొత్త సీజన్లో కుంభకర్ణుడితో హనుమంతుడు చేయబోయే పోరాటం చూడొచ్చు.

మిరల్ - ఆహా ఓటీటీ

ఏడాదిన్నర కిందట తమిళంలో రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ గత నెలలో తెలుగులోనూ రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాని మిరల్ శుక్రవారం (జూన్ 7) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

105 మినిట్స్ - ఆహా ఓటీటీ

హన్సిక నటించిన సింగిల్ క్యారెక్టర్ థ్రిల్లర్ మూవీ 105 మినిట్స్. ఈ సినిమా కూడా శుక్రవారం (జూన్ 7) నుంచే ఆహా ఓటీటీలోకి రాబోతోంది.

కల్కి - ఈటీవీ విన్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన మూవీ కల్కి. ఈ సినిమాను గురువారం (జూన్ 6) నుంచే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది.

మైదాన్ - ప్రైమ్ వీడియో

అజయ్ దేవగన్, ప్రియమణి నటించిన మైదాన్ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇన్నాళ్లూ రెంటల్ విధానంలో తీసుకొచ్చిన ఆ ఓటీటీ.. ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024