Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలతో ఫుల్ టైంపాస్.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్-weekend ott releases heeramandi manjummel boys broken news season 2 shaitaan in netflix prime video zee5 hotstar aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weekend Ott Releases: ఈ వీకెండ్ ఓటీటీలతో ఫుల్ టైంపాస్.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్

Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలతో ఫుల్ టైంపాస్.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్

Hari Prasad S HT Telugu
May 02, 2024 02:10 PM IST

Weekend OTT Releases: ప్రతి వీకెండ్ ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కోసం ఎదురు చూస్తారా? అయితే ఈ వీకెండ్ మీరు అస్సలు డిసప్పాయింట్ అవరు. ఎందుకంటే ఈసారి అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చేస్తున్నాయి.

ఈ వీకెండ్ ఓటీటీలతో ఫుల్ టైంపాస్.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్
ఈ వీకెండ్ ఓటీటీలతో ఫుల్ టైంపాస్.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్

Weekend OTT Releases: ఈ వీకెండ్ మీకు అస్సలు బోర్ కొట్టదు. ఇది గ్యారెంటీ. ప్రతి వారం కంటే ఈ వీకెండ్ మిమ్మల్ని టైంపాస్ చేయడానికి ఓటీటీల్లోకి బోలెడంత కంటెంట్ వచ్చేస్తోంది. ఇందులో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇవి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5లాంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.

yearly horoscope entry point

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

మంజుమ్మల్ బాయ్స్ - హాట్‌స్టార్

అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా మంజుమ్మల్ బాయ్స్ మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ ఆదివారం (మే 5) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు మిగతా భాషల వెర్షన్లన్నీ హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతాయి.

హీరామండి (వెబ్ సిరీస్) - నెట్‌ఫ్లిక్స్

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన హీరామండి వెబ్ సిరీస్ బుధవారమే (మే 1) నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. భన్సాలీ మూవీస్ ను ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుందనడంలో సందేహం లేదు. 1940లనాటి లాహోర్ లోని వేశ్యల జీవితం చుట్టూ తిరిగే కథ ఇది.

సైతాన్ - నెట్‌ఫ్లిక్స్

అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక నటించిన హారర్ మూవీ సైతాన్. బాక్సాఫీస్ దగ్గర సక్సెసై ఈ సినిమా శుక్రవారం (మే 3) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. వీకెండ్ లో ఈ సినిమా చూసి భయపడటానికి రెడీ అయిపోండి.

ది బ్రోకెన్ న్యూస్ 2 (వెబ్ సిరీస్) - జీ5 ఓటీటీ

జీ5 ఓటీటీలో గతంలో వచ్చిన బ్రోకెన్ న్యూస్ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సొనాలీ బింద్రె నటించిన ఈ సిరీస్ రెండో సీజన్ కూడా శుక్రవారం (మే 3) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అసుర గురు - ఆహా ఓటీటీ

అసుర గురు ఓ తమిళ యాక్షన్ థ్రిల్లర్. 2020లో వచ్చిన ఈ మూవీని రాజ్‌దీప్ డైరెక్ట్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం (మే 3) నుంచి ఈ సినిమాను చూడొచ్చు.

హ్యాపీ ఎండింగ్ - ఆహా ఓటీటీ

ఆహా ఓటీటీలోకి మరో తెలుగు కామెడీ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు హ్యాపీ ఎండింగ్. యశ్ పూరి, అపూర్వ రావ్ జంటగా నటించిన ఈ మూవీ శుక్రవారం (మే 3) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం.

సిద్ధార్థ్ రాయ్ - ఆహా ఓటీటీ

తెలుగులో అర్జున్ రెడ్డి రేంజ్ లో వచ్చి సంచలనం సృష్టించిన మూవీ సిద్ధార్థ్ రాయ్. ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. రెండున్నర నెలల తర్వాత శుక్రవారం (మే 3) ఆహా ఓటీటీలోకి వస్తోంది.

Whats_app_banner