Asura Guru Telugu OTT: తెలుగులో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోన్న కోలీవుడ్ యాక్షన్ మూవీ అసుర గురు
Asura Guru Telugu OTT: విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అసుర గురు తెలుగులోకి రాబోతోంది. డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో మే3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Asura Guru Telugu OTT: కోలీవుడ్ మూవీ అసుర గురు అదే పేరుతో తెలుగులోకి డబ్ అవుతోంది. ఈ యాక్షన్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఆహా ఓటీటీ ద్వారా ఈ తమిళ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 3 నుంచి తెలుగులో అసుర గురు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
2020లో రిలీజ్...
2020లో తమిళంలో రిలీజైన ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. మహిమా నంబియార్ కీలక పాత్ర పోషించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రాజ్‌దీప్ దర్శకత్వం వహించాడు. తమిళంలో నాలుగేళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలు పెట్టిన బడ్జెట్‌లో సగం కూడా రాబట్టలేకపోయింది. ఈ డిజాస్టర్ మూవీ ఇప్పుడు తెలుగులో రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది.
అసురగురు కథ ఇదే...
ఓ దొంగ కథతో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాజ్‌దీప్ ఈ మూవీని తెరకెక్కించాడు. శక్తి ( విక్రమ్ ప్రభు) ఓ దొంగ. పోలీసులకు దొరక్కుండా ధనవంతుల డబ్బును దోచేస్తుంటాడు. అతడిని పోలీసులకు పట్టించేందుకు దివ్య (మహిమా నంబియార్) ప్రయత్నిస్తుంటుంది.
శక్తి, దివ్య ఒకటేనని, సామాన్యులకు సాయపడాలనే సంకల్పంతోనే ఈ వారు ఈ దొంగతనాలు చేస్తున్నారనే నిజం బయటపడుతుంది. అదేమిటి? శక్తిని పోలీసులు పట్టుకున్నారా? దివ్య, శక్తి మధ్య ఉన్న సంబంధమేమిటన్నదే ఈ మూవీ కథ.
సుబ్బరాజు కీలక పాత్ర...
అసుర గురు సినిమాలో ట్విస్ట్‌లు, టర్న్‌లతో పాటు విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ పాత్రల నేపథ్యంలో వచ్చే ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను అలరించాయి. కానీ కథ రొటీన్ కావడంతో సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ తమిళ మూవీలో తెలుగు నటుడు సుబ్బరాజు ఓ కీలక పాత్రలో కనిపించాడు. యోగిబాబు కమెడియన్‌గా కనిపించాడు.
కోలీవుడ్‌లో డిఫరెంట్ స్టోరీస్...
సీనియర్ హీరో ప్రభు తనయుడిగా కుమ్కి సినిమాతో హీరోగా కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు విక్రమ్ ప్రభు. జయాపజయాలకు అతీతంగా హీరోగా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వస్తోన్నాడు.
గత ఏడాది రిలీజైన ఇరుగపాట్రు మూవీలో విక్రమ్ ప్రభు నటనకు ప్రశంసలు దక్కాయి. యాక్షన్ ఇమేజ్‌కు భిన్నంగా ఈ మూవీలో సాఫ్ట్ రోల్ చేశాడు. మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌లో ఓ కీలక పాత్ర చేశాడు.
ఛాలెంజింగ్ రోల్స్…
మహిమా నంబియార్ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది. గత ఏడాది తమిళంలో ఆరు సినిమాలు చేసింది. గ్లామర్ రోల్స్ కంటే ఎక్కువగా ఛాలెంజింగ్ పాత్రల్లోనే కనిపిస్తోంది మహిమా నంబియార్. విజయ్ ఆంటోనీ రత్తంలో విలన్‌గా నటించింది. ముత్తుయ్య మురళీధరన్ బయోపిక్‌లో డ్యూయల్ రోల్ చేసింది.