Vn Aditya: మ‌న‌సంతా నువ్వే డైరెక్ట‌ర్ కొత్త మూవీ - అమెరికాలో ఆడిష‌న్స్ - షూటింగ్ అక్క‌డే!-vn aditya new movie announced in america tollywood news manasantha nuvve director ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vn Aditya: మ‌న‌సంతా నువ్వే డైరెక్ట‌ర్ కొత్త మూవీ - అమెరికాలో ఆడిష‌న్స్ - షూటింగ్ అక్క‌డే!

Vn Aditya: మ‌న‌సంతా నువ్వే డైరెక్ట‌ర్ కొత్త మూవీ - అమెరికాలో ఆడిష‌న్స్ - షూటింగ్ అక్క‌డే!

Nelki Naresh Kumar HT Telugu
Jul 09, 2024 02:58 PM IST

Vn Aditya: మ‌న‌సుంతా నువ్వే, నేనున్నాను సినిమాల ఫేమ్ వీఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త మూవీ రాబోతోంది. ఈ సినిమాను అమెరికాలో వీఎన్ ఆదిత్య అనౌన్స్‌చేశాడు.

 వీఎన్ ఆదిత్య
వీఎన్ ఆదిత్య

Vn Aditya: మనసంతా నువ్వే లాంటి ట్రెండ్ సెట్ట‌ర్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వీఎస్ ఆదిత్య‌. ఉద‌య్ కిర‌ణ్‌, రీమా సేన్ జంట‌గా న‌టించిన ఈ ల‌వ్ స్టోరీ స్టార్ హీరోల సినిమాల‌ను డామినేట్ చేస్తూ 2001లో టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. మ‌న‌సంతా నువ్వే త‌ర్వాత శ్రీరామ్, నేనున్నాను వంటి సినిమాల‌ను తెర‌కెక్కించారు. కొంత గ్యాప్ త‌ర్వాత వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుంది.

అమెరికాలో అనౌన్స్‌మెంట్‌...

ఈ సినిమాను అమెరికాలో అనౌన్స్ చేశాడు వీఎన్ ఆదిత్య‌. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే ఈ కొత్త మూవీ అమెరికా నేప‌థ్యంలోనే సాగుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమా నిర్మాణం డల్లాస్‌లో సిటీలోనే జ‌ర‌గ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌ మీదకువెళ్ల‌నుంది.

ఆడిష‌న్స్ కు ఫారిన‌ర్స్‌...

ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే నూత‌న నిర్మాణ సంస్థ సార‌థ్యంలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా.. ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా హీరోహీరోయిన్ల‌తో పాటు ప‌లువురు కొత్త న‌టీన‌టుల‌కు టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు వీఎస్ ఆదిత్య‌. ఈ సినిమా ఆడిష‌న్స్‌ జూలై 7న‌ ఆదివారం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ సిటీ... లాకింట బంకేట్‌ హాల్‌లో జ‌రిగాయి.

ఈ ఆడిష‌న్స్‌లో ప్ర‌వాస భారతీయులు మాత్రమే కాక.. అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్ వంటి విదేశీయులు పాల్గొన్నారు. ఈ మూవీలో తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ వారు నటించేందుకు ఆసక్తి చూపుతూ.. ఆడిషన్స్‌లో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌ని వీఎన్ ఆదిత్య అన్నాడు. వీఎన్ ఆదిత్య గ‌త సినిమాల త‌ర‌హాలోనే సున్నిత‌మైన భావోద్వేగాల‌కు పెద్ద‌పీట వేస్తూ ఫీల్‌ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

ల‌వ్ @65 రిలీజ్‌...

వీఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తెలుగు మూవీ ల‌వ్ @65 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌య‌సుధ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. 65 ఏళ్ల వ‌య‌సు త‌ర్వాత ప్రేమ‌లో ప‌డిన ఓ జంట క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో ఆదిగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌, కావేరిగా జ‌య‌ప్ర‌ద న‌టిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

WhatsApp channel