Shivani Rajasekhar | మిస్ ఇండియా ఆడిషన్స్‌కు రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ-shivani rajasekhar competes in miss india 2022 auditions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shivani Rajasekhar | మిస్ ఇండియా ఆడిషన్స్‌కు రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ

Shivani Rajasekhar | మిస్ ఇండియా ఆడిషన్స్‌కు రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ

Maragani Govardhan HT Telugu
Apr 20, 2022 07:46 AM IST

రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ మిస్ ఇండియా పోటీలకు వెళ్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం మోడలింగ్‌తో పాటు సినిమాలతోనూ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.

<p>శివానీ రాజశేఖర్&nbsp;</p>
శివానీ రాజశేఖర్ (Instagram)

హీరో రాజశేఖర్ ముద్దుల తనయ.. శివానీ రాజశేఖర్ ఇప్పటికే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఓటీటీలో విడుదలైన అద్భుతం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటోంది. దీంతో ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. ఓ పక్క హీరోయిన్‌గా చేస్తూనే.. మరోపక్క మోడలింగ్‌పైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఫెమినా మిస్ ఇండియా 2022 కాంపిటీషన్‌లో పోటీ పడుతుంది. ఈ పోటీలకు సంబంధించి ఆడిషన్స్‌‌లో పాల్గొంటోంది శివానీ. ఈ విషయాన్నే ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది.

నేను కొత్త అడ్వెంచర్ మొదలుపెడుతున్నాను. బెస్ట్ విషెస్! మిస్ ఇండియా ఆర్గ్. ఈ అద్భుతమైన అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నేటి ఆడిషన్‌కు రాబోయే అందమైన అమ్మాయిలందరికీ శుభాకాంక్షలు. అని శివానీ రాజశేఖర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఈ రోజు నుంచే మిస్ ఇండియా ఆడిషన్స్ జరుగుతున్నట్లు శివానీ వెల్లడించింది. తాను ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, తెలంగాణ, తమిళనాడుకు కూడా అర్హత సాధించానని తెలియజేసింది. ఈ ఆడిషన్స్‌తో తాను 8వ ర్యాంకులో నిలిచినట్లు తెలిపింది.

మరోపక్క సినిమాలతోనూ బిజీగా ఉంది శివానీ. తన తండ్రి రాజశేఖర్ నటిస్తోన్న శేఖర్ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ ముద్దుగుమ్మ. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో లలిత్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఎంఎల్‌వీ సత్యనారాయణ, రాజశేఖర్, జీవిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం