Vishwak Sen Gaami: గామికి కావాలని నెగటివ్ రివ్యూలు.. విశ్వక్‌సేన్ మాస్ వార్నింగ్-vishwak sen warns gaami negative reviewers legal action will be taken against them says actor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen Gaami: గామికి కావాలని నెగటివ్ రివ్యూలు.. విశ్వక్‌సేన్ మాస్ వార్నింగ్

Vishwak Sen Gaami: గామికి కావాలని నెగటివ్ రివ్యూలు.. విశ్వక్‌సేన్ మాస్ వార్నింగ్

Hari Prasad S HT Telugu
Mar 13, 2024 08:12 AM IST

Vishwak Sen Gaami: తన గామి మూవీకి కావాలని నెగటివ్ రివ్యూలు ఇస్తున్న వారికి మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ గట్టి వార్నింగే ఇచ్చాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా రేటింగ్స్ ను కొందరు తారుమారు చేస్తున్నారు.

గామికి కావాలని నెగటివ్ రివ్యూలు.. విశ్వక్‌సేన్ మాస్ వార్నింగ్
గామికి కావాలని నెగటివ్ రివ్యూలు.. విశ్వక్‌సేన్ మాస్ వార్నింగ్

Vishwak Sen Gaami: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన మూవి గామి. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది. తొలి షో నుంచే కాస్త పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే తర్వాత సడెన్ గా కొందరు పనిగట్టుకొని మూవీకి నెగటివ్ రివ్యూలు ఇవ్వడంపై తాజాగా విశ్వక్ సేన్ స్పందించాడు. వాళ్లకు ఓ మాస్ వార్నింగ్ ఇచ్చాడు.

గామి నెగటివ్ రివ్యూలపై విశ్వక్ సేన్

ఈమధ్య కాలంలో టాలీవుడ్ లోని మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటి గామి. గత శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ప్రస్తుతం కొందరు పనిగట్టుకొని నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారు. దీనిపై మూవీ హీరో విశ్వక్ సేన్ స్పందిస్తూ ఓ ప్రకటన జారీ చేశాడు. అలాంటి వాళ్లపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాడు.

ముఖ్యంగా బుక్ మై షో సైట్లో గామి మూవీకి వ్యతిరేకంగా కొందరు రివ్యూలు ఇస్తున్నారు. ప్రత్యేకంగా దీనికోసమే కొన్ని బాట్స్ క్రియేట్ చేసి మరీ మూవీకి వచ్చిన స్టార్ రేటింగ్స్ ను తారుమారు చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సినిమాకు 10 రేటింగ్స్ కు గాను 9 ఇచ్చిన రివ్యూలను కూడా కొందరు 1 స్టార్ గా మార్చేశారని విశ్వక్ సేన్ వెల్లడించాడు.

ఫేక్ రివ్యూలను క్రియేట్ చేస్తూ పదికి ఒక స్టార్ రేటింగ్స్ ఇస్తున్నారని కూడా ఆరోపించాడు. ఈ నెగటివ్ ప్రచారంపై స్పందిస్తూ విశ్వక్ సేన్ అధికారిక ప్రకటన జారీ చేశాడు. మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయినందుకుగాను అతడు మీడియా, విమర్శకులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూనే.. ఇలా నెగటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.

నిజానికి ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలను టార్గెట్ చేస్తూ నెగటివ్ రివ్యూలు ఇవ్వడం సాధారణమైపోయింది. గతంలో పుష్ప, ఈ మధ్యే వచ్చిన గుంటూరు కారం సినిమాలను కూడా ఇలా టార్గెట్ చేశారు. గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించినా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగటివ్ రివ్యూలతో కొంత ప్రభావితమైంది.

గామి మూవీ ఎలా ఉందంటే?

అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు విద్యాధ‌ర్ గామి సినిమాను తెర‌కెక్కించాడు. మూడు క‌థ‌లను క‌లుపుతూ సాగే గ‌మ్మ‌త్తైన సినిమా ఇది. స్క్రీన్‌ప్లే, విజువ‌ల్స్, వీఎఫ్ఎక్స్‌తో మ్యాజిక్ చేయాల‌ని అనుకున్నాడు డైరెక్ట‌ర్‌. మూడు క‌థ‌ల‌ను క‌లుపుతూ వ‌చ్చే ట్విస్ట్ స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.

శంక‌ర్‌, దుర్గ‌, మెడిక‌ల్ సెంట‌ర్‌లోచిక్కుకున్న కుర్రాడు ముగ్గురు జీవితాల్ని ప్యారాల‌ల్‌గా చూపిస్తూ చివ‌రి వ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా సినిమా సాగుతుంది. స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో చిక్కుకొని వారు ప‌డే సంఘ‌ర్షణ నుంచి చ‌క్క‌టి ఎమోష‌న్స్ రాబ‌ట్టుకున్నాడు డైరెక్ట‌ర్‌. హిమ‌లాయాల బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే సీన్స్‌, సింహంతో యాక్ష‌న్ ఎపిసోడ్ హైలైట్ అనిపిస్తాయి.

శంక‌ర్ అనే అఘోరా పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ జీవించాడు. పాత్ర కోసం అత‌డు ప‌డిన క‌ష్టం స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. అత‌డి లుక్‌, బాడీలాంగ్వేజ్ గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా క‌నిపిస్తుంది. అభిన‌య‌, అబ్దుల్ స‌మద్‌ల న‌ట‌న బాగుంది. చాందిని చౌద‌రి పాత్ర క‌థ‌కు సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తుంది. యాక్టింగ్‌లో మాత్రం విశ్వ‌క్‌సేన్‌తో పోటీప‌డింది.

Whats_app_banner