Vijay Sethupathi Maharaja: హనుమాన్ తర్వాత ఇంతపెద్ద హిట్ ఇదే.. రోజు రోజుకి 200 శాతం గ్రోత్.. డబ్బుతోపాటు పేరు-vijay sethupathi maharaja movie success meet distributor shashidhar reddy speech hanuman movie maharaja collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Sethupathi Maharaja: హనుమాన్ తర్వాత ఇంతపెద్ద హిట్ ఇదే.. రోజు రోజుకి 200 శాతం గ్రోత్.. డబ్బుతోపాటు పేరు

Vijay Sethupathi Maharaja: హనుమాన్ తర్వాత ఇంతపెద్ద హిట్ ఇదే.. రోజు రోజుకి 200 శాతం గ్రోత్.. డబ్బుతోపాటు పేరు

Sanjiv Kumar HT Telugu
Jun 18, 2024 12:28 PM IST

Makkal Selvan Vijay Sethupathi Maharaja Movie Success: హనుమాన్ తర్వాత ఇంత పెద్ద హిట్ సినిమా మహారాజానే అని డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అన్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా సక్సెస్ మీట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

హనుమాన్ తర్వాత ఇంతపెద్ద హిట్ ఇదే.. రోజు రోజుకి 200 శాతం గ్రోత్.. డబ్బుతోపాటు పేరు
హనుమాన్ తర్వాత ఇంతపెద్ద హిట్ ఇదే.. రోజు రోజుకి 200 శాతం గ్రోత్.. డబ్బుతోపాటు పేరు

Maharaja Movie Success Meet: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'మహారాజ'. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలో మ్యాసీవ్‌గా రిలీజ్ చేసింది.

మహారాజా సక్సెస్ మీట్

విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన మహారాజా జూన్ 14న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకొని మాస్టర్ పీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సాధించి, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించింది.

మాస్టర్ పీస్ సినిమా

మహారాజా సక్సెస్ మీట్‌కు వచ్చేసిన డైరెక్టర్ మారుతి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. "ఈ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. మహారాజా గురించి అందరూ చాలా హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారు. ఈ సినిమా చూసి షాక్ అయ్యాను. ఇంటర్వెల్‌కే సినిమా గురించి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. చాలా గొప్ప సినిమా ఇది. మాస్టర్ పీస్ సినిమా. దర్శకుడు చాలా అద్భుతంగా రాసి తీశారు" అని డైరెక్టర్ మారుతి అన్నారు.

చాలా రేర్‌గా వస్తాయి

"ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. ఇలాంటి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించిన టీం అందరికీ థాంక్స్. విజయ్ సేతుపతి గారు ఈ జనరేషన్‌కి గ్రేట్ ఆర్టిస్ట్. డైరెక్టర్స్ ఫేవరేట్ హీరో. ఆయన ఇలాంటి గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మహారాజాని థియేటర్స్‌లో మిస్ అవ్వొద్దు. ఫ్యామిలీస్‌తో కలసి వెళ్లి సినిమా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు" అని ప్రభాస్ రాజా డీలక్స్ డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చారు.

బ్రహ్మరథమే ఈ కలెక్షన్స్

"అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రీ రిలీజ్ విజయ్ సేతుపతి గారి నటవిశ్వరూపం చూస్తారని చెప్పాను. ఇప్పుడు స్క్రీన్ మీద అదే చూశారు. విజయ్ సేతుపతి గారి సినిమాకు తెలుగు ఆడియన్స్ ఇచ్చిన బ్రహ్మరథం ఈ కలెక్షన్స్" అని మహారాజా డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తెలిపారు.

డబ్బుతోపాటు పేరు

"మొదటి రోజు నుంచి స్క్రీన్ పెంచుతూనే ఉన్నాం. రోజురోజుకి 200 పెర్సెంట్ గ్రోత్. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. మహారాజాతో మాకు డబ్బుతో పాటు పేరు కూడా వచ్చింది. ఈ సినిమా ఎంత రేంజ్ అనేది ఇంకా ఎవరూ చెప్పలేరు. రోజురోజుకి జనాలు పెరుగుతున్నారు. ఈ ఏడాది హనుమాన్ తర్వాత ఇంతపెద్ద హిట్ ఈ సినిమానే అని నమ్ముతున్నాను" అని శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

చాలా సర్‌ప్రైజ్ అవుతారు

"విజయ్ గారిపై తెలుగు ప్రేక్షకులకు ఉన్న ప్రేమ రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారికి ధన్యవాదాలు. చూడనివారు థియేటర్స్‌కి రండి. కచ్చితంగా చాలా సర్‌ప్రైజ్ అవుతారు" అని డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.

ఇష్టంగా ప్రేమిస్తారు

తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. సినిమాని చాలా ఇష్టంగా ప్రేమిస్తారు. ఈ సినిమాకి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. కథ, స్క్రీన్ ప్లే, పెర్ఫార్మెన్స్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది'' అని మహారాజా డైరెక్టర్ నితిలన్ సామినాథన్ అన్నారు. కాగా ఈ మహారాజా మూవీ సక్సెస్ ఈవెంట్‌లో మూవీ యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

WhatsApp channel