OTT: ఇంకో భాషలో అందుబాటులోకి వస్తున్న విజయ్ దేవరకొండ మూవీ.. మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో..
The Family Star OTT: ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా థియేటర్లలో అంచనాలను అందులేకపోయినా ఓటీటీలో పర్వాలేదనిపించింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం మరో భాషలోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. రెండో ఓటీటీలో అడుగుపెట్టనుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ ఏడాది ఎదురుదెబ్బ తగిలింది. భారీ హైప్‍తో వచ్చిన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీపై విజయ్ చాలా నమ్మకం పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో ఫ్యామిలీ స్టార్ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. అయితే, ఓటీటీలో మాత్రం బాగానే ఆదరణ దక్కించుకుంది. అయితే, ఇప్పుడు మరో ఓటీటీలో ఇంకో భాషలో ఈ చిత్రం రానుంది.
ది ఫ్యామిలీ స్టార్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 26వ తేదీనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు హిందీలో వెర్షన్ కూడా వచ్చేస్తోంది.
హిందీలో ఎప్పుడు.. ఎక్కడ?
ఫ్యామిలీ స్టార్ సినిమా హిందీ వెర్షన్ జూన్ 28వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై జియోసినిమా అధికారిక ప్రకటన చేసింది. దీంతో హిందీ వెర్షన్‍లో ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.
లైగర్ చిత్రంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరో అయ్యారు. ఆ చిత్రం డిజాస్టర్ అయినా విజయ్‍కు మాత్రం ఫుల్ పాపులారిటీ వచ్చింది. దీంతో ఫ్యామిలీ స్టార్ హిందీ వెర్షన్‍కు మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.
ఫ్యామిలీ స్టార్ గురించి..
ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించారు. గతంలో విజయ్ - పరశురామ్ కాంబోలో వచ్చిన గీతగోవిందం భారీ బ్లాక్‍బస్టర్ అయింది. దీంతో ఫ్యామిలీ స్టార్ మూవీపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొన్ని సీన్లు ట్రోలింగ్‍కు కూడా గురయ్యాయి.
ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటించారు. జగపతి బాబు, వాసుకీ, అభిరామి, వెన్నెల కిశోర్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి గోపిసుందర్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‍రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫ్యామిలీ స్టార్ కలెక్షన్లు
ఫ్యామిలీ స్టార్ సినిమా సుమారు రూ.50 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, ఈ చిత్రానికి ఫుల్ రన్‍లో కేవలం రూ.20కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ మాత్రం అంచనాలను అందుకోలేదు. తీవ్రంగా నిరాశపరిచింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మాత్రం ఫ్యామిలీ స్టార్ మూవీకి మంచి వ్యూస్ దక్కాయి. సుమారు మూడు వారాల పాటు ఈ చిత్రం టాప్‍లో ట్రెండ్ అయింది. ఇప్పుడు, ఈ చిత్రం హిందీ వెర్షన్ జియోసినిమాలో వస్తోంది.
విజయ్ తదుపరి సినిమాలు
విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ యాక్ష్ చిత్రం (VD12) చేస్తున్నారు. డైరెక్టర్ రాహుల్ సంస్కృతియన్‍తో ఓ పీరియడ్ యాక్షన్ మూవీకి ఓకే చెప్పారు. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ తెరకెక్కనుంది. దర్శకుడు రవికిరణ్ కోలాతోనూ విజయ్ ఓ చిత్రం చేయనున్నారని తెలుస్తోంది.
టాపిక్