Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‍ను నిరూపిస్తున్న ఫ్యామిలీస్టార్!-family star movie trending top on amazon prime video ott despite of negativity this prooving vijay deverakonda stardom ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‍ను నిరూపిస్తున్న ఫ్యామిలీస్టార్!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‍ను నిరూపిస్తున్న ఫ్యామిలీస్టార్!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 30, 2024 03:07 PM IST

Family Star - Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఎంత నెగెటివిటీ వచ్చినా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. నేషనల్ వైడ్‍గా ట్రెండింగ్‍లో టాప్‍లో కొనసాగుతోంది. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దీంతో అర్థమవుతోంది.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‍ను నిరూపిస్తున్న ఫ్యామిలీస్టార్!
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‍ను నిరూపిస్తున్న ఫ్యామిలీస్టార్!

Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ పరాజయం చవిచూసింది. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని.. బాక్సాఫీస్ వద్ద చతికిపడింది. గీతగోవిందంతో ఒకప్పుడు మ్యాజిక్ చేసిన విజయ్ - డైరెక్టర్ పరశురామ్ కాంబో ఈసారి విఫలమైంది. ఫ్యామిలీ స్టార్ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. చాలా నెగెటివిటీ మూటగట్టుకుంది. దీంతో మూడు వారాల్లోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

తొలి రోజు నుంచే టాప్‍లో ట్రెండింగ్

ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, థియేటర్లలో ప్లాఫ్ టాక్ తెచ్చుకోవడం, ట్రోల్స్‌కు గురవటంతో ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోననే టెన్షన్ నెలకొంది. అయితే, ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ చిత్రం దుమ్మురేపుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చిన తొలి రోజే ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకొచ్చేసింది ఫ్యామిలీ స్టార్ సినిమా. ఓటీటీలోకి వచ్చాక కూడా కొన్ని సీన్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అయినా.. ఓటీటీలో మాత్రం ఈ మూవీకి జోరు తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ మూవీ నేషనల్ వైడ్‍ ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍లోనే ఉంది. దీంతో విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ ఏ రేంజ్‍లో ఉందో అర్థమవుతోంది. ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ అదరగొడుతుండటంతో రౌడీ హీరో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వరుస ప్లాఫ్‍లు

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన తొలి మూవీ పెళ్లిచూపులు (2016) సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి (2017), గీతగోవిందం (2018) చిత్రాలు బ్లాక్‍బస్టర్లు అవటంతో విజయ్ కెరీర్ గ్రాఫ్ కొన్నేళ్లకే చాలా పెరిగిపోయింది. యూత్‍లో ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే, గీతగోవిందం తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ మాత్రం విజయ్ దేవరకొండకు తగ్గలేదు. మధ్యలో టాక్సీవాలా (2018) పర్వాలేదనిపించినా.. నోటా (2018), డియర్ కామ్రెడ్ (2019), వరల్డ్ ఫేమస్ లవర్ (2020) తీవ్రంగా నిరాశపరిచాయి. లైగర్ (2022) సినిమాతో పాన్ ఇండియా రేంజ్‍లో గుర్తింపు వచ్చినా అది అల్ట్రా డిజాస్టర్ అయింది. గతేడాది ఖుషి (2023)ది అదే పరిస్థితి.

అయితే, సుమారు ఐదేళ్లుగా సరైన హిట్ లేకపోయినా విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ అంతగా తగ్గలేదు. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి విడుదలకు ముందు కూడా బజ్ బాగానే ఏర్పడింది. అయితే, మూవీ మరీ నిరాశపరిచేలా ఉందనే టాక్ రావటంతో ప్లాఫ్‍గా మారింది. అయితే, ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ట్రోల్స్, విమర్శలు, నెగెటివిటీ విషయం ఎలాగున్నా.. విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతోంది.

ఫ్యామిలీ స్టార్ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.20కోట్లలోపు వసూళ్లను రాబట్టగలిగింది.

విజయ్ దేవరకొండ లైనప్

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం (VD12) చేస్తున్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ కావటంతో చాలా అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‍తో ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా ఎంపికయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాపై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అలాగే, తదుపరి డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఓ పొలిటికల్ యాక్షన్ మూవీని కూడా విజయ్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‍రాజు నిర్మించనున్నారు.

IPL_Entry_Point