Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?
- The Family Star OTT Release: ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.
- The Family Star OTT Release: ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.
(1 / 5)
భారీ అంచనాలతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
(2 / 5)
ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.
(3 / 5)
ఏప్రిల్ 26న ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళంలో ది ఫ్యామిలీ స్టార్ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది. అంచనాల కంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతుంది.
(4 / 5)
ఫ్యామిలీ స్టార్ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. విజయ్ - పరశురామ్ దర్శకత్వంలో గతంలో గీతగోవిందం సూపర్ హిట్ కాగా.. ఈసారి ఈ మ్యాజిక్ రిపీట్ కాలేదు. ఫ్యామిలీ స్టార్ చిత్రం ఫ్లాఫ్‍గా నిలిచింది. సుమారు రూ.50కోట్లతో రూపొందిన ఈ మూవీకి రూ.35కోట్ల లోపు కలెక్షన్లు వచ్చాయి.
ఇతర గ్యాలరీలు