Comedy Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సెటైరికల్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Malayalam Comedy Movie OTT: ‘జలధార పంప్‍సెట్ సిన్స్ 1962’ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి ఈ మూవీ వచ్చింది. ఈ చిత్రంలో ఊర్వశి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే..
సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్ర పోషించిన ‘జలధార పంప్‍సెట్ సిన్స్ 1962’ చిత్రం గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని సెటైరికల్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు ఆశిష్ చిన్నప్ప. పంప్ సెట్ దొంగతనం కేసు సంవత్సరాల పాటు కోర్టులో సాగడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ‘జలధార పంప్‍సెట్ సిన్స్ 1962’ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ వివరాలివే..
జలధార పంప్‍సెట్ సిన్స్ 1962 సినిమా జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. నేడే (సెప్టెంబర్ 15) స్ట్రీమింగ్ మొదలైంది. థియేటర్లలో రిలీజైన దాదాపు 13 నెలలకు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం జియోసినిమా ఓటీటీలో మలయాళం ఆడియోలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ ఉన్నాయి.
జలధార పంప్‍సెట్ సిన్స్ 1962 సినిమాలో మృణాళిని టీచర్ పాత్ర పోషించారు ఊర్వశి. ఇంద్రన్స్, సనుషా, సాగర్ రాజన్, జానీ ఆంటోనీ, టీజీ రవి, విజయరాఘవన్, నిషా సారంగ్, జయన్ చేర్తలా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని డైరెక్టర్ ఆశిష్ చెన్నప్ప తెరకెక్కించారు. చిన్న కేసు కూడా కోర్టుల్లో సంవత్సరాల పాటు ఎలా కొనసాగుతాయో సెటైరికల్‍గా ఈ చిత్రంలో చూపించారు. కామెడీ ప్రధానంగానే ఈ మూవీని రూపొందించారు.
జలధార పంప్‍సెట్ సిన్స్ 1962 చిత్రాన్ని వండర్‌ఫ్రేమ్స్ ఫిల్మ్ ల్యాండ్ పతాకంపై బైజూ చెల్లమ్మ, సాగర్ రాజన్, సనితా శశిధరన్, ఆర్య పృథ్విరాజ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి కైలాస్ మీనన్ సంగీతం అందించగా.. సాజిత్ పురుషన్ సినిమాటోగ్రఫీ చేశారు.
స్టోరీ లైన్
పంప్ సెట్ దొంగతనం.. దానిపై కోర్టులో కేసు సంవత్సరాల పాటు సాగుతూనే ఉండడం చుట్టూ జలధార పంప్‍సెట్ సిన్స్ 1962 మూవీ స్టోరీ నడుస్తుంది. మృణాళిని (ఊర్వశి) ఇంటి కాంపౌండ్‍లో ఉండే పంప్‍సెట్ దోపిడీకి గురవుతుంది. అయితే, దీన్ని దొంగలించిన మణి (ఇంద్రన్స్)ను పక్కింటి వారు పట్టేసుకుంటారు. చిన్న విషయామేనంటూ సెటిల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. అయితే, మణి తప్పును అంగీకరింకపోవటంతో కోర్టులో కేసు వేస్తారు మృణాళిని. ఈ కేసు సంవత్సరాల పాటు సాగుతూనే ఉంటుంది. చాలా మంది దీంట్లోకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? తీర్పు ఎప్పుడు, ఎలా వచ్చింది? అనే విషయాలు ఈ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
ఈ వారం మరిన్ని మలయాళ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. తలవన్ చిత్రం సోనీ లివ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో బిజూ మీనన్, ఆసిఫ్ లీడ్ రోల్స్ చేశారు. జిస్ జాయ్ దర్శకత్వం వహించారు. జీ5 ఓటీటీలో క్రైమ్ కామెడీ మూవీ ‘నునకుళి’ చిత్రం ఇదే వారం అడుగుపెట్టింది. ఈ మలయాళ చిత్రం కూడా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో పట్టపాకల్, విశేషం చిత్రాలు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి.