OTT Malayalam Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చేసిన నాలుగు మలయాళ సినిమాలు.. రెండు తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Malayalam Movies: ఈ వారం ఏకంగా నాలుగు మలయాళ సినిమాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. రెండు సినిమాలు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
ఓటీటీల్లోకి కొత్తగా ఏ మలయాళ చిత్రాలు వచ్చాయా అని ప్రేక్షకులు వెతికేస్తుంటారు. ఓటీటీల్లో మలయాళ సినిమాల కోసం ఇతర భాషల ఆడియన్స్ కూడా ఎదురుచూస్తుంటారు. ఈ వారం (సెప్టెంబర్ రెండో వారం) నాలుగు మలయాళ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. ఇందులో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉంది. ఓ కామెడీ డ్రామా సినిమా కూడా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ వారం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాలుగు మలయాళ చిత్రాలు ఇవే..
తలవన్
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలవన్’ ఈ మంగళవారం (సెప్టెంబర్ 10) సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ స్ట్రీమింగ్ అవుతోంది. మే 24వ థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ స్పందన దక్కించుకొని హిట్ అయింది. దాదాపు 80 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తలవన్ చిత్రంలో బిజూ మీనన్, ఆసిఫ్ ప్రధాన పాత్రలు పోషించగా జిస్ జాయ్ దర్శకత్వం వహించారు. జీ5 ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి భారీగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
నునకుళి
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘నునకుళి’ ‘జీ5’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో శుక్రవారం (సెప్టెంబర్ 13) అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడలో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. నునకుళి చిత్రంలో బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ, సిద్ధిఖీ, బైజూ సంతోష్, నిఖిల విమల్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. దృశ్యం సహా చాలా హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ జితూ జోసెఫ్.. నునకుళి చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పర్సనల్ వీడియో ఉన్న ల్యాప్‍టాప్‍ను ఐటీ అధికారి సీజ్ చేయగా.. దాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఓ వ్యక్తి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు జీ5 ఓటీటీలో చూసేయవచ్చు.
పట్టపాకల్
పట్టపాకల్ చిత్రం ఈ వారమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. గతంలో సైనాప్లే అనే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. ఈ డార్క్ కామెడీ డ్రామా చిత్రం ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి టాక్‍తో పాటు అంచనాలకు తగ్గట్టు వసూళ్లు దక్కించుకుంది. పట్టపాకల్ చిత్రంలో జానీ ఆమటోనీ, ఆషిక అశోకరన్, కృష్ణ శంకర్, రమేశ్ పిషరోడీ, సుధి కొప్ప ప్రధాన పాత్రలు పోషించారు. సాజిర్ సదాఫ్ దర్శకత్వం వహించారు.
విశేషం
మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం ‘విశేషం’ ఈ మంగళవారమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుపెట్టింది. ప్రస్తుతం మలయాళంలో ఒక్కటే స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. విశేషం చిత్రంలో ఆనంద్, మధుసూధన్, చిన్ను చాందినీ, బైజూ జాన్సన్, అల్తాఫ్ సలీమ్, జానీ ఆంటోనీ, పీపీ కున్నికృష్ణమ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సూరజ్ టామ్ దర్శకత్వం వహించారు. విశేషం చిత్రం జూలై 19న థియేటర్లలో రిలీజైంది. సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.