Top Rated Indian Web Series: ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. అత్యధిక ఐఎండీబీ రేటింగ్ ఆ సిరీస్‌కే..-top rated indian web series imdb top rated web series scam 1992 aspirants panchayat in prime video netflix sonyliv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Top Rated Indian Web Series: ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. అత్యధిక ఐఎండీబీ రేటింగ్ ఆ సిరీస్‌కే..

Top Rated Indian Web Series: ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. అత్యధిక ఐఎండీబీ రేటింగ్ ఆ సిరీస్‌కే..

Hari Prasad S HT Telugu
Mar 26, 2024 01:19 PM IST

Top Rated Indian Web Series: ఇండియాలో ప్రస్తుతం అత్యధిక రేటింగ్ కలిగిన వెబ్ సిరీస్ ఏవి? ఐఎండీబీలో ప్రేక్షకులు ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం.. టాప్ 10 సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.

ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. అత్యధిక ఐఎండీబీ రేటింగ్ ఆ సిరీస్‌కే..
ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. అత్యధిక ఐఎండీబీ రేటింగ్ ఆ సిరీస్‌కే..

Top Rated Indian Web Series: ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో సాధారణ ప్రేక్షకులు థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లకు తమ రేటింగ్స్ ఇస్తుంటారు. అత్యధికంగా 10కిగాను 8కిపైగా రేటింగ్స్ సాధించిన వెబ్ సిరీస్ ఈ టాప్ 10లో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్ లాంటి ఓటీటీల్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఐఎండీబీ టాప్ రేటెడ్ వెబ్ సిరీస్ ఇవే

స్కామ్ 1992 - సోనీలివ్

సోనీలివ్ ఓటీటీలో 2020లో వచ్చిన స్కామ్ 1992 వెబ్ సిరీస్ ఇప్పటికే ఇండియాలో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ కలిగిన సిరీస్ గా ఉంది. 1992లో హర్షద్ మెహతా చేసిన స్టాక్ మార్కెట్ కుంభకోణం చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ కు ఐఎండీబీలో అత్యధికంగా 9.3 రేటింగ్ ఉండటం విశేషం.

ఆస్పిరెంట్స్ - ప్రైమ్ వీడియో

అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీస్ ఈ ఆస్పిరెంట్స్. సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి ఐఏఎస్ కావాలని కలలు కనే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీలో 9.2 రేటింగ్ వచ్చింది. ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) అందించిన అద్భుతమైన సిరీస్ ఇది.

గుల్లక్ - సోనీలివ్

ఇండియా అంటేనే మిడిల్ క్లాస్ తో నడిచే దేశం. అలాంటి దేశంలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఓ పిగ్గీ బ్యాంక్ ఉంటుంది. దాని చుట్టూ తిరిగే కథే ఈ గుల్లక్. ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాన్ని మనసారా నవ్వుకునేలా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది.

పంచాయత్ -ప్రైమ్ వీడియో

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ కోసం సిద్ధమవుతున్న వెబ్ సిరీస్ పంచాయత్. ఇంజినీరింగ్ చదివి పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేయాలని ఆశపడిన ఓ యువకుడు చివరికి యూపీలోని ఓ మారుమూల గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా వెళ్తాడు. అక్కడ అతడు పడే ఇబ్బందులు, ఆ తర్వాత ఊళ్లో వాళ్లతో అతనికి ఏర్పడే బంధాన్ని ఈ సిరీస్ లో మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు. ఈ సిరీస్ కు 8.9 రేటింగ్ ఉంది.

ది ఫ్యామిలీ మ్యాన్ - ప్రైమ్ వీడియో

మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సిరీస్ కు 8.7 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

పర్మనెంట్ రూమ్మేట్స్ - ప్రైమ్ వీడియో

మూడేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న జంట చివరికి పెళ్లి చేసుకోవాలన్న ప్లాన్స్ లో ఉంటుంది. వీళ్ల మధ్య ఉండే ప్రేమలు, వచ్చే తగాదాల చుట్టూ ఈ పర్మనెంట్ రూమ్మేట్స్ తిరుగుతుంది. ప్రైమ్ వీడియోలోని ఈ సిరీస్ కు 8.6 రేటింగ్ ఉంది.

సేక్రెడ్ గేమ్స్- నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్ కు కూడా 8.5 రేటింగ్ ఉంది. ఈ సిరీస్ లో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీలాంటి వాళ్లు నటించారు.

ది రైల్వే మెన్ - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లోనే 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ విషాదంపై రూపొందించిన వెబ్ సిరీస్ ది రైల్వే మెన్. ఆ సమయంలో భోపాల్ స్టేషన్ లో ఉన్న రైల్వే సిబ్బంది ఎంతో మంది నగర వాసుల ప్రాణాలను ఎలా కాపాడారో ఈ సిరీస్ లో చూపించారు. రైల్వే మెన్ సిరీస్ కు కూడా 8.5 రేటింగ్ ఉంది.

ఢిల్లీ క్రైమ్ - నెట్‌ఫ్లిక్స్

2012లో జరిగిన నిర్భయ రేప్ కేసు ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో ఉండగా.. దీనికి కూడా 8.5 రేటింగ్ ఉంది.

జూబ్లీ - ప్రైమ్ వీడియో

ప్రైమ్ వీడియోలోని ఈ జూబ్లీ వెబ్ సిరీస్ కు 8.3 రేటింగ్ ఉంది. ఇది బాలీవుడ్ తొలినాళ్లలోని రాయ్ టాకీస్ స్టూడియో చుట్టూ తిరిగే కథ. అప్పటి సినిమా రాజకీయాలను కళ్లకు కట్టింది.

Whats_app_banner