OTT Movies: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 క్రేజీ సినిమాలు.. ఏది ఎక్కడ చూడాలంటే?-top 3 ott streaming movies on march 8 ooru peru bhairavakona ott merry christmas ott release anweshippin kandethum ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 క్రేజీ సినిమాలు.. ఏది ఎక్కడ చూడాలంటే?

OTT Movies: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 క్రేజీ సినిమాలు.. ఏది ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 12:02 PM IST

New OTT Released Movies: ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లోకి ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు దర్శనం ఇస్తూనే ఉంటాయి. అలా ఈ వారం కూడా చాలా సినిమాలే వచ్చాయి. ఇక మార్చి 8న అయితే ఏకంగా 12 నుంచి 16 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. వాటిలో 3 బ్లాక్ బస్టర్ అండ్ క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 క్రేజీ సినిమాలు.. ఏది ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 క్రేజీ సినిమాలు.. ఏది ఎక్కడ చూడాలంటే?

New OTT Movies: ఓటీటీల్లో ఎప్పటికప్పుడు సరికొత్త నేపథ్యం, డిఫరెంట్ జోనర్లతో సినిమాలు వస్తూనే ఉంటాయి. సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంటాయి. అలా ఈ వారం కూడా ఓటీటీల్లో సినిమాలు సందడి చేశాయి. వాటిలో కేవలం ఒక శుక్రవారం ఒక్కరోజే అంటే మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా దాదాపుగా 16 సినిమాల వరకు విడుదల అయ్యాయి. వాటిలో మూడు సినిమాలు మాత్రం హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్స్‌లోని బ్లాక్ బస్టర్ అండ్ క్రేజీ చిత్రాలు స్పెషల్ కానున్నాయి.

ఊరు పేరు భైరవకోన ఓటీటీ

హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన. హారర్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పించారు. ఊరు పేరు భైరవకోన సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్‌గా నటించారు. వీరితోపాటు వెన్నెల కిశోర్, హర్ష చెముడు (వైవా హర్ష) కామెడీ పండించగా.. వడివుక్కరసి, పి రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్

జనవరిలో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఊరు పేరు భైరవ కోన సినిమా అనేక వాయిదాలు దాటి ఫిబ్రవరి 16న థియేటర్‌లలో విడుదలైంది. సినిమాకు దాదాపుగా చాలా వరకు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని మైనస్‌లా ఉన్నప్పటికీ ప్రేక్షకులను బాగానే అలరించింది ఊరు పేరు భైరవకోన. అలాంటి ఈ సినిమా కేవలం 21 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 8 నుంచి ఊరు పేరు భైరవ కోన స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మొదట్లో ఈ సినిమా జీ5, ఆహా ఓటీటీల్లో రిలీజ్ అవుతుందని రూమర్స్ వచ్చాయి.

మేర్రీ క్రిస్మస్ ఓటీటీ

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ హాట్ బ్యూటి కత్రీనా కైఫ్ జోడీగా నటించిన మూవీ మేరీ క్రిస్మస్. అనేక పోస్టర్లతో క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమాను డిసెంబర్‌లో క్రిస్మస్‌ ఫెస్టివల్ సందర్భంగా సినిమాను విడుదల చేద్దామనుకున్నారు. కానీ, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన మేరీ క్రిస్మస్ సినిమాను జనవరి 12న విడుదల చేసి సంక్రాంతి బరిలో నిలిపారు. ప్రముఖ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.

నెట్ ఫ్లిక్స్

మేరీ క్రిస్మస్ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయని పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన మేర్రీ క్రిస్మస్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది మేర్రీ క్రిస్మస్ మూవీ.

అన్వేషిప్పిన్ కండేతుమ్ ఓటీటీ

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా అన్వేషిప్పిన్ కండేతుమ్. మలయాళ పాపులర్ హీరో టొవినో థామస్ నటించిన ఈ క్రైమ్ అండ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలై భారీ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 8 నుంచి అన్వేషిప్పిన్ కండేతుమ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు డార్విన్ కురైకోస్ దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీని చేధించే పోలీస్ ఆఫీసర్‌గా టొవినో థామస్ నటించాడు.

ఇక ఇవే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో షో టైమ్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నాగినీ బ్యూటి మౌనీ రాయ్, ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ నటించారు. అలాగే ఇదివరకే హిందీలో స్ట్రీమింగ్ అవుతోన్న 12th ఫెయిల్ మూవీ తెలుగు వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోకి వచ్చింది.