OTT Horror Movies: ఓటీటీలో గుండె దడ పెంచే హారర్ సినిమాలు.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి!-best telugu horror movies in youtube calling bell movie demonte colony rakshasi l 7 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Movies: ఓటీటీలో గుండె దడ పెంచే హారర్ సినిమాలు.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి!

OTT Horror Movies: ఓటీటీలో గుండె దడ పెంచే హారర్ సినిమాలు.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Feb 25, 2024 07:30 PM IST

Horror Movies In Youtube Telugu: ఓటీటీల్లో హారర్ చిత్రాలు చూసే వారి సంఖ్య దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. చాలా వరకు ప్రేక్షకులకు ఈ భయపెట్టే హారర్ మూవీస్ చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేనివారు కూడా ఈ హారర్ మూవీస్ చూసే అవకాశం ఉంది. అది ఎలా అంటే..

ఓటీటీలో గుండె దడ పెంచే హారర్ సినిమాలు.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి!
ఓటీటీలో గుండె దడ పెంచే హారర్ సినిమాలు.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి!

Best Horror Movies In Youtube: హారర్ మూవీస్‌, వెబ్ సిరీసులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే భయపెట్టే హారర్ చిత్రాలు, సిరీసులను చూసేవారి కోసం ప్రతివారం ఓటీటీ సంస్థలు రిలీజ్ చేస్తుంటాయి. కానీ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేనివారికోసం యూట్యూబ్‌లో అన్ని రకాల జోనర్స్ మూవీస్ రిలీజ్ చేస్తుంటారు. అలా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న గుండె దడ పెంచే హారర్ సినిమాలను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయొచ్చు. మరి ఆ భయపెట్టే హారర్ మూవీస్ ఏంటో లుక్కేద్దాం.

కాలింగ్ బెల్

కొత్తగా పెళ్లి అయిన జంట ఓ ఇంట్లోకి దిగుతారు. ఆ ఇంట్లో దెయ్యం ఉందని తెలియక చాలా సంతోషంగా గడుపుతుంటారు. కానీ, తర్వాత ఆ ఇల్లు ఖాలీ చేసి వెళ్లిపోతుంది ఆ జంట. కట్ చేస్తే అదే ఇంటికి కొంతమంది స్నేహితులు వస్తారు. అప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగిందనే కథతో కాలింగ్ బెల్ మూవీ తెరకెక్కించారు. కొన్ని థ్రిల్ల్స్, హారర్ సీన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. దీనికి సీక్వెల్‌ కూడా తెరకెక్కించారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయొచ్చు.

రాక్షసి

కాలింగ్ బెల్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించిందే ఈ రాక్షసి మూవీ. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ ఇద్దరు పిల్లల తల్లిగా లీడ్ రోల్ చేసింది. ఓ ఇంట్లోకి పిల్లలతో దిగిన పూర్ణ తనకు ఎదురైన అనుభవాల గురించి ఓ స్వామిజీకి చెబుతుంది. అప్పుడు స్వామిజీ చెప్పిన నిజాలు విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఇంట్లో ఉన్న దెయ్యానికి వీళ్లు బలి అయ్యారా. అయితే కాలింగ్ బెల్ మూవీకి దీన్ని ఎలా లింక్ చేశారనేది సినిమాలోనే చూడాలి. మరి హారర్ కాకుండా టైమ్ పాస్‌గా సినిమాను చూడొచ్చు.

ఎల్ 7 (L7 Movie)

యూట్యూబ్‌లో హిందీ డబ్బ్‌డ్ వెర్షన్ మూవీ ఎల్ 7కి 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంతగా హిట్ అయిందో. దాదాపుగా హరర్ సినిమాల్లో రొటీన్‌గా ఉండే కథతోనే ఈ సినిమా స్టోరీ ఉంటుంది. కొత్తగా ఓ ఇంట్లోకి దిగిన ఓ జంటకు ఎదురైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే, ఒంటరిగా అమ్మాయి ఉన్నప్పుడు మాత్రమే దెయ్యం భయపెడుతుంది. అలా ఎందుకు జరుగుతుంది. అసలు కారణాలు ఏంటీ అనేదే సినిమా కథ. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

డిమోంటీ కాలనీ

నలుగురు ఫ్రెండ్స్ సరదాగా గడుపుతుంటారు. అక్కడ ఎంతోమంది చాలా రకాలుగా చెప్పుకునే ఓ పాత భవనంలోకి సరదాగా వెళ్తారు ఆ ఫ్రెండ్స్. అనంతరం అక్కడి నుంచి వచ్చేవాళ్లకు ఓ నెక్లెస్ దొరుకుతుంది. ఆ తర్వాత ఆ స్నేహితుల మధ్య ఏం జరిగింది, వారు ఎలాంటి సంఘటనలు ఫేస్ చేశారు అనేదే సినిమా కథ. ఊహించని ట్విస్టులతో మంచి హారర్ ఎఫెక్ట్‌తో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది. దీనికి సీక్వెల్‌గా డిమోంటీ కాలనీ 2 కూడా రాబోతుంది.

IPL_Entry_Point