Ravi Teja: ఆ విషయంలో ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం వేచిచూస్తున్నా: ఈగల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో రవితేజ
Ravi Teja - Eagle movie Pre release event: ఈగల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. ఈ చిత్రంలో గెటప్ తనకు చాలా నచ్చిందని హీరో రవితేజ అన్నారు. మరిన్ని కామెంట్స్ చేశారు.
Ravi Teja - Eagle movie: మాస్ మహారాజ రవితేజకు ధమాకా మూవీ తర్వాత ఆ రేంజ్ హిట్ దక్కలేదు. గతేడాది రావణాసురతో పాటు భారీ అంచనాల మధ్య వచ్చిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే, రవితేజ హీరోగా నటించిన ఈగల్ మూవీపై మంచి హైప్ ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ వచ్చే వారం ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ అదిరిపోవటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈగల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 4) హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో మాట్లాడారు హీరో రవితేజ.
ఈగల్ చిత్రంలో తన గెటప్.. తనకు చాలా నచ్చిందని రవితేజ అన్నారు. తన గెటప్ విషయంలో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని వేచిచూస్తున్నానని చెప్పారు. ఈ మేకోవర్ రావడానికి సుమారు రెండు, మూడు నెలలు పట్టిందని రవితేజ తెలిపారు. ఈ సినిమా ఔట్‍పుట్ చాలా బాగా వచ్చిందని అన్నారు.
“నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్ ఇది. దీని కోసం దాదాపు రెండు, మూడు నెలలు పట్టింది. నేను చాలా వేచిచూస్తున్నా. ఫస్ట్ టైమ్ ఇలాంటి మేకోవర్ చేశా. ఎదురుచూస్తున్నా” అని రవితేజ అన్నారు. ఫస్ట్ సినిమాలా తాను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్పారు. ఈగల్ చిత్రంలో నిండైన గడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్‍తో ఫుల్ మాస్, రగెడ్ లుక్‍తో రవితేజ ఉన్నారు.
నవదీప్‍లో విపరీతమైన వెటకారం
ఈగల్ మూవీలో నవదీప్ కూడా ఓ కీలకమైన క్యారెక్టర్ చేస్తున్నారు. కాగా, నవదీప్‍కు ఓ బలమైన పాత్ర పడాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఈ చిత్రంతో అతడికి మరింత మంచి పేరు వస్తుందని రవితేజ అన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాలో అతడి డైలాగ్స్ ఉంటాయని తెలిపారు. నవదీప్‍తో ఓ కామెడీ సినిమా చేయాలని తనకు ఉందని, ఎందుకంటే అతడిలో విపరీతమైన వెటకారం ఉందని రవితేజ చెప్పారు.
ఈగల్ చిత్రాన్ని అనుపమ పరమేశ్వరన్ పాత్రే ముందుకు నడిపిస్తుందని హింట్ ఇచ్చారు రవితేజ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తనకు హోమ్ బ్యానర్ లాంటిదని, ఈ బ్యానర్లో ఎన్ని సినిమా చేసేందుకైనా తాను రెడీ అని చెప్పారు. రవితేజ బ్లాక్‍బాస్టర్ ధమాకా చిత్రం కూడా ఆ బ్యానరే నిర్మించింది. ఈగల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో స్పీచ్‍ను త్వరగా ముగించారు మాస్ మహారాజ.
ఈగల్ మూవీలో రవితేజకు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్ కీలకపాత్రలు పోషించారు. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి దేవ్ జండ్ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా ఫేమస్ అయిన కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా ఇది రెండో చిత్రం. ఈగల్ ట్రైలర్ మాస్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్‍లతో ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
గరుడం పాట రిలీజ్
ఈగల్ చిత్రం నుంచి గరుడం అనే పవర్‌ఫుల్ సాంగ్ కూడా నేడు రిలీజ్ అయింది. ఈ థీమ్ సాంగ్‍కు ఇంటెన్స్ ట్యూన్స్ ఇచ్చారు దేవ్ జండ్. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీకృష్ణ పాడారు. ఫిబ్రవరి 9న తెలుగుతో పాటు హిందీలోనూ ఈగల్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడి ఇప్పుడొస్తోంది.