Eagle Movie Trailer: 'విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను': రవితేజ ‘ఈగల్’ మూవీ ట్రైలర్ రిలీజ్-eagle movie trailer released ravi teja action and dialogues are powerful ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Eagle Movie Trailer: 'విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను': రవితేజ ‘ఈగల్’ మూవీ ట్రైలర్ రిలీజ్

Eagle Movie Trailer: 'విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను': రవితేజ ‘ఈగల్’ మూవీ ట్రైలర్ రిలీజ్

Eagle Movie Trailer: ఈగల్ సినిమా ట్రైలర్ వచ్చేంది. హీరో రవితేజ యాక్షన్ సీన్లు, డైలాగ్స్ హైలైట్‍గా ఉన్నాయి.

ఈగల్ సినిమాలో రవితేజ

Eagle Movie Trailer: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ చిత్రంపై మంచి క్రేజ్ ఉంది. ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా రవితేజ నయా లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈగల్ సినిమా ట్రైలర్‌ను మూవీ యూనిట్ నేడు (డిసెంబర్ 20) రిలీజ్ చేసింది.

ఈగల్ మూవీ ట్రైలర్ రవితేజ మాస్ యాక్షన్, పవర్‌ఫుల్, ఎలినేషన్ డైలాగ్‍లతో ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా పవర్ ప్యాక్డ్‌గా ఉంది. “తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేదెప్పుడో తెలుసా.. అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు” అంటూ అనుపమ పరమేశ్వరన్‍తో నవదీప్ చెప్పే డైలాగ్‍తో ఈగల్ ట్రైలర్ మొదలైంది. “విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఆపుతాను.. కాపలా అవుతాను. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను” అంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ ఉంది. రవితేజ, హీరోయిన్ కాప్యా థాపర్ మధ్య లవ్ ట్రాక్ కూడా ట్రైలర్లో కనిపిస్తుంది. రవితేజ యాక్షన్, డైలాగ్‍లు ఈ ట్రైలర్‌కు హైలైట్‍గా నిలిచాయి.

“ఆయుధంతో విధ్వంసం చేసే వాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు” అంటూ రవితేజ చెప్పే డైలాగ్‍తో ట్రైలర్ ముగిసింది. ఒక నిమిషం 56 సెకన్ల పాటు ఉన్న ఈగల్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రంలో పత్తి రైతు పాత్రగా రవితేజ కనిపించనున్నారు. “మార్గశిరం.. మధ్యరాత్రి ఓ మొండి మోతుబరి చేసిన మారణహోమం గురించి తెలియాలి” అంటూ నవదీప్ డైలాగ్ కూడా ఉంది. మొత్తంగా సమాజంలోని చీడను (విలన్లు) కూడా రవితేజ ఏరేస్తాడనేలా ఇది ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ డావ్‍జంద్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌ను ఎలివేట్ చేసింది.

ఈగల్ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. డావ్ జంద్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.