Telugu OTT: నేరుగా ఓటీటీలోకి తెలుగు క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Telugu OTT: తెలుగు క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ తత్వ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తోంది. ఈ టీవీ విన్ ఓటీటీలో అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. రిత్విక్ ఎలగిరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో హిమ దాసరి, ఉస్మాన్ గని కీలక పాత్రల్లో నటించారు.
Telugu OTT: తెలుగు క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ తత్వ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తోంది. తత్వ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఈటీవీ విన్ ఓటీటీ సొంతం చేసుకున్నది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను ఈటీవీ విన్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. అక్టోబర్ 10న తత్వ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది.
ఈటీవీ విన్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఇద్దరు వ్యక్తులు గన్ పట్టుకొని కనిపిస్తున్నారు. బుల్లెట్ నుంచి తప్పించుకోవచ్చు....నేరం చేసి మాత్రం తప్పించుకోలేవు అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతుంది.
హిమ దాసరి...
తత్వ మూవీలో హిమ దాసరి, ఉస్మాన్ ఘని, పూజారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ ఇండిపెండెంట్ మూవీకి రిత్విక్ ఎలగిరి దర్శకత్వం వహించగా మాసన దాసరి ప్రొడ్యూస్ చేసింది.
ఆరిఫ్ కథ...
ఆరిఫ్ అనే యువకుడు అనుకోకుండా ఓ క్రైమ్‌లో చిక్కుకుంటాడు. తాను ఏ నేరం చేయలేదని ఎంత చెప్పిన పోలీసులు నమ్మరు. ఆరిఫ్ నేరస్తుడిగా మారడానికి కారణం ఏమిటి? అసలు ఏ నేరం క్రింద అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు?
ఆరిఫ్ జీవితాన్ని తలక్రిందులు చేసిన ఒక్కరాత్రిలో ఏం జరిగింది అన్నదే తత్వలో మూవీలో సస్పెన్స్, థ్రిల్ కలబోతగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. తత్వ మూవీకి సాయితేజ మూవీకి అందించాడు. రిత్విక్ ఎలగిరికి దర్శకుడిగా ఇదే మొదటి మూవీ అని సమాచారం. గతంలో ప్రభాస్ సాహో మూవీకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు.
ఒకే రోజు రెండు సినిమాలు...
ఈటీవీ విన్ ఓటీటీలోకి అక్టోబర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు రాబోతున్నాయి.అక్టోబర్ 10న తత్వతో పాటు పైలం పిలగా మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. పైలం పిలగా మూవీలో సాయితేజ, పావని కరణం హీరోహీరోయిన్లుగా నటించారు. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించాడు.
ఈ రెండు సినిమాలతో పాటు కలి మూవీ అక్టోబర్‌లోనే ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీలో నరేష్ అగస్త్య, ప్రిన్స్ కీలక పాత్రల్లో నటించారు.
కొరియన్ వెబ్‌సిరీస్ హిడెన్ ఐడెంటీటీ అక్టోబర్‌లోనే ఈటీవీ విన్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టాపిక్