Telugu OTT: ఈ వారం ఓటీటీలో ఆరు తెలుగు సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - ఈ క్రైమ్, యాక్షన్ సినిమాలపై ఓ లుక్కేయండి!
Telugu OTT: ఈ వారం నాలుగు తెలుగు సినిమాలతో పాటు రెండు తెలుగు వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. ఆ సిరీస్‌లు సినిమాలు ఏవంటే?
Telugu OTT: ఈ వారం నాలుగు సినిమాలు, రెండు వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో తెలుగు ఆడియెన్స్‌ను అలరించబోతున్నాయి. ఈ వీక్ ఓటీటీలలో యాక్షన్, క్రైమ్ కథాంశాలదే హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వారం ఓటీటీలో రిలీజైన, కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఏవంటే?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ థియేటర్లలో రిలీజైన పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 14 న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. . తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ స్ట్రీమింగ్ కానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటించింది. అంజలి ఓ కీలక పాత్ర పోషించింది. మే 31న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
విశ్వక్‌సేన్ యాక్టింగ్‌తో పాటు రా అండ్ రస్టిక్‌గా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించిన తీరు బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ కథ రొటీన్ కావడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అవుతోన్న తెలుగు సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపైనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది.
పారిజాతపర్వం...
చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన పారిజాతపర్వం మూవీ ఆహా ఓటీటీలో జూన్ 12 న రిలీజైంది. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పారిజాత పర్వం ఆహా ఓటీటీలో ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఉంది.
నేరుగా ఓటీటీలోకి...
డైరెక్టర్ అల్లరి రవిబాబు కథను అందిస్తూ ప్రొడ్యూస్ చేసి తెలుగు మూవీ రష్ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో గురువారం రిలీజైంది. తన కూతురితో పాటు భర్తను కాపాడుకోవడానికి ఓ గృహిణి చేసిన సాహసం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది.
డియర్ నాన్న
చైతన్యరావు హీరోగా నటించిన డియర్ నాన్న మూవీ ఆహా ఓటీటీలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తండ్రీకొడుకుల అనుబంధంతో రూపొందిన ఈ మూవీకి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. నేరుగా ఈ మూవీ ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది.
రెండు తెలుగు వెబ్‌సిరీస్‌లు...
ఈ శుక్రవారం రెండు తెలుగు వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఓ సిరీస్ ఫాంటసీ హారర్ కథాంశంతో తెరకెక్కగా మరో వెబ్‌సిరీస్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది.
నివేతా పేతురాజ్ పరువు
నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన పరువు వెబ్‌సిరీస్ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్‌లో నాగబాబు, నరేష్ అగస్త్య కీలక పాత్రలు పోషించారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ వెబ్‌సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసింది. పరువు వెబ్‌సిరీస్‌కు సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సాదినేని షో రన్నర్‌గా వ్యవహరిస్తోన్నాడు.
బాహుబలి ప్రొడ్యూసర్స్ యక్షిణి
బాహుబలి ప్రొడ్యూసర్స్ నిర్మించిన తెలుగు వెబ్‌సిరీస్ యక్షిణి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూన్ 14న రిలీజ్ కానుంది. హారర్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో వేదిక, మంచులక్ష్మితో పాటు రాహుల్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.