Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే-netflix top 10 trending movies and web series crew shaitaan laapata ladies heeramandi the great indian kapil show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్ లో కిందటి వారం తర్వాత టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ మారింది. ప్రస్తుతం సినిమాల్లో క్రూ, వెబ్ సిరీస్ లో హీరామండి టాప్ లో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ లలో ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ప్రతి వారం మారుతూ ఉంటాయి. తాజాగా మే 27 నుంచి జూన్ 2తో ముగిసిన వారానికి తమ ప్లాట్‌ఫామ్ పై టాప్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ విడుదల చేసింది. వీటిలో చాలా వరకు కొన్నాళ్లుగా ఉన్నవే టాప్ 10లో కొనసాగుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లో తొలి స్థానంలో బాలీవుడ్ మూవీ క్రూ (Crew) ఉంది. రెండు వారాలుగా ఈ సినిమా టాప్ 1లోనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర కూడా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు టబు, కరీనా కపూర్, కృతి సనన్ కలిసి నటించిన ఈ సినిమాను నిజ జీవిత ఘటనల నుంచి స్ఫూర్తి పొంది తీశారు.

రెండో స్థానంలో లాపతా లేడీస్ మూవీ ఉంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చినప్పటి నుంచీ టాప్ 10లోనే ఉంటూ వస్తోంది. గత ఆరు వారాలుగా ఈ సినిమాకు తిరుగులేకుండా పోతోంది. మూడు, నాలుగు వారాల పాటు టాప్ లో కొనసాగినా.. క్రూ వచ్చిన తర్వాత రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు పదో స్థానంలో ఉన్న ఫైటర్ మూవీ 10 వారాలుగా, ఏడో స్థానంలో ఉన్న ఆర్టికల్ 370 ఏడు వారాలుగా టాప్ 10లో కొనసాగుతున్నాయి.

1. క్రూ

2. లాపతా లేడీస్

3. అట్లస్

4. సైతాన్

5. ఎం3గాన్

6. మేడమ్ వెబ్

7. ఆర్టికల్ 370

8. గాడ్జిల్లా మైనస్ వన్

9. లియో (హిందీ)

10. ఫైటర్

టాప్ 10 టీవీ షోలు ఇవే

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 షోస్ లిస్ట్ చూస్తే తొలి స్థానంలో హీరామండి వెబ్ సిరీస్ కొనసాగుతోంది. గత ఐదు వారాలుగా ఈ సిరీస్ టాప్ లోనే కొనసాగుతుండటం విశేషం. ఇక పది వారాలుగా టాప్ 10లోనే ఉన్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రెండో స్థానంలో ఉంది. ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ 23 వారాలుగా, ఖాకీ ది బిహార్ ఛాప్టర్ 21 వారాలుగా టాప్ 10లో కొనసాగుతున్నాయి.

1. హీరామండి: ది డైమండ్ బజార్

2. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 1

3. డెమోన్ స్లేయర్

4. బ్రిడ్జర్టన్: సీజన్ 3

5. మామ్లా లీగల్ హై సీజన్ 1

6. జురాసిక్ వరల్డ్: కయోస్ థియరీ: సీజన్ 1

7. ది 8 షో: లిమిటెడ్ సిరీస్

8. ది రైల్వే మెన్ - ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ భోపాల్ 1984

9. ఖాకీ: ది బిహార్ ఛాప్టర్: సీజన్ 1

10. బ్రిడ్జర్టన్: సీజన్ 1