Gangs of Godavari OTT: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే?-vishwak sen neha shetty gangs of godavari to premiere on netflix from june 14th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gangs Of Godavari Ott: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే?

Gangs of Godavari OTT: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 09, 2024 10:25 AM IST

Gangs of Godavari OTT: విశ్వ‌క్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. . జూన్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఓటీటీ
గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఓటీటీ

Gangs of Godavari OTT: విశ్వ‌క్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆదివారం ఆఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు. ఈ యాక్ష‌న్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14న రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను పంచుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు వారాల్లోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నేహా శెట్టి హీరోయిన్‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో అంజ‌లి ఓ కీల‌క పాత్ర పోషించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాల‌కృష్ణ రావ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో ఈ ఈ యాక్ష‌న్ మూవీ తెలుగు ఆడియెన్స్‌లో మంచి బ‌జ్‌ను క్రియేట్ చేసింది. క‌లిగించింది.

ఎనిమిది రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప‌దికోట్ల‌కుపైనే జ‌రిగింది. దాదాపు ప‌ద‌కొండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి రిలీజైంది. ఎనిమిది రోజుల్లో 19.20 కోట్ల‌కుపైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను, ప‌దిన్న‌ర కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మ‌రో యాభై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌డితే ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టే అవ‌కాశం ఉంది. ఓటీటీ రిలీజ్‌కు మ‌రో ఐదు రోజులు స‌మ‌యం ఉండ‌టంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తోన్నాయి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి క‌థ ఇదే

ర‌త్నాక‌ర్ అలియాస్ లంకల ర‌త్న (విశ్వ‌క్‌సేన్‌) చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోతాడు. దొంగ‌త‌నాలు చేస్తూ బ‌తికే ర‌త్న త‌న తెలివితేట‌లు, ధైర్యంతో ఎమ్మెల్యే దొర‌స్వామిరాజు గ్యాంగ్‌లో చేరుతాడు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల‌ దొర‌స్వామిరాజుకు (గోప‌రాజు ర‌మ‌ణ‌) వ్య‌తిరేకంగా ర‌త్న‌ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాడు. నానాజీ (నాజ‌ర్‌) స‌హాయంతో ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌ర్వాత ర‌త్న జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? సాధార‌ణ దొంగ అత‌డు..టైగ‌ర్ ర‌త్న‌గా ఎలా మారాడు ?ర‌త్న ఏ నేరం చేసి జైలుకు వెళ్లాడు? లంక‌ల ర‌త్న‌ను ప్రేమించిన పెళ్లాడిన బుజ్జి (నేహాశెట్టి)అత‌డిని చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించింది? ర‌త్న‌కు వేశ్య ర‌త్న‌మాల‌తో (అంజ‌లి) ఉన్న సంబంధం ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

విశ్వ‌క్ సేన్ ఎన‌ర్జీ...

లంకల ర‌త్న‌ పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్‌, ఎన‌ర్జీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీలో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. విజువ‌ల్స్, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పాటు యువ‌ర్ శంక‌ర్ రాజీ బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. కానీ ఇలాంటి హీరోయిజం క‌థ‌ల‌తో తెలుగులో ఇదివ‌ర‌కు చాలా సినిమాలు రావ‌డంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి యావ‌రేజ్‌గా హిట్‌గా నిలిచింది.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో గోపరాజు రమణ, నాజర్ కీలక పాత్రలు పోషించారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్