Swag Teaser: స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?-swag teaser released sree vishnu on fun mode ritu varma comeback movie release date to be out soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Swag Teaser: స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?

Swag Teaser: స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu

Swag Teaser: టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు మరోసారి కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా గురువారం (ఆగస్ట్ 29) అతడు నటిస్తున్న స్వాగ్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో అతడు తన స్వాగ్ తో అదరగొట్టాడు.

స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?

Swag Teaser: శ్రీ విష్ణు నటిస్తున్న మరో మూవీ స్వాగ్. విలక్షణ నటనతో ఆకట్టుకునే ఈ యువ హీరో ఇప్పుడు మరో కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఓం భీమ్ బుష్ అనే ఓ హారర్ కామెడీ మూవీతో హిట్ కొట్టిన అతడు.. ఈసారి ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాతో రాబోతున్నట్లు స్వాగ్ మూవీ టీజర్ చూస్తే తెలుస్తోంది.

స్వాగ్ మూవీ టీజర్

స్వాగ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ను గురువారం (ఆగస్ట్ 29) సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్లో రిలీజ్ చేశారు.

రెండు నిమిషాలకుపైగా ఉన్న ఈ టీజర్ మొదటి నుంచీ చివరి వరకూ నవ్విస్తూనే ఉంది. శ్రీ విష్ణు తన స్వాగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీగా టీజర్ చూస్తే తెలుస్తోంది.

స్వాగ్ టీజర్ ఎలా ఉందంటే?

స్వాగ్ మూవీ టీజర్ కొన్ని వందల ఏళ్ల కిందట అసలు మగ బిడ్డ పుడితే చంపేసే రోజుల్లో మొదలవుతుంది. అప్పట్లో వింజమర వంశానికి రాణిగా ఉన్న రుక్మిణీ దేవి (రీతూ వర్మ).. మగవాళ్లపై ద్వేషంతో తన వంశంలో మగబిడ్డ పుట్టకూడదని అనుకుంటుంది. ఒకవేళ పుట్టినా చంపేస్తానంటుంది. ఆ సమయంలో ఈ వంశంలో ఇక మగ పిల్లాడు పుట్టడు అంటూ శ్రీ విష్ణు ఎంట్రీ ఇస్తాడు.

కట్ చేస్తే టీజర్ ప్రస్తుతానికి వచ్చేస్తుంది. ఇది దానికి పూర్తి భిన్నంగా సాగుతుంది. ఈ కాలంలో ఆడవాళ్లతో ఆడుకునే వ్యక్తిగా శ్రీ విష్ణు కనిపిస్తాడు. ఇక గత జన్మలో మగ వాళ్లను ద్వేషించే రాణిగా ఉన్న రీతూ వర్మ.. ఇప్పుడు అతనికి బానిసగా మారిపోతుంది.

నాలుగు పాత్రల్లో శ్రీ విష్ణు

శ్రీ విష్ణు ఈ సినిమాలో సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు భిన్నమైన పాత్రల్లో నటిస్తుండటం విశేషం. నాలుగు పాత్రల్లో నాలుగు డిఫరెంట్ షేడ్స్, భిన్నమైన డైలాగ్ డెలివరీతో అతడు ఆకట్టుకున్నాడు. రెండు కాలాల మధ్య సాగే ఈ సినిమా అసలు కథ ఏంటి? దీని ఎండింగ్ ఎలా ఉంటుందన్నది మూవీ చూస్తేనే తెలుస్తుంది.

అయితే గతేడాది సామజవరగమన, ఈ ఏడాది ఓం భీమ్ బుష్ లతో వరుస హిట్స్ కొట్టిన శ్రీ విష్ణు.. ఈ స్వాగ్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. రీతూ వర్మతోపాటు మీరా జాస్మిన్ కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించనుంది. సునీల్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.