Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. తిరుగులేని బ్రహ్మముడి
Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఇందులోనూ బ్రహ్మముడి సీరియల్ కు తిరుగే లేకుండాపోయింది. మరే సీరియల్ దీని నంబర్ వన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.
Star Maa Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లో తనకు తిరుగు లేదని మరోసారి నిరూపించుకున్నాయి స్టార్ మా, అందులో వచ్చే బ్రహ్మముడి సీరియల్. 38వ వారానికి సంబంధించి రిలీజైన రేటింగ్స్ లో టాప్ 5 సీరియల్స్ లోనూ స్టార్ మా ఛానెల్ కు చెందిన సీరియల్సే కొనసాగాయి. ఇక టాప్ లోనూ బ్రహ్మముడే ఉంది. ఈ సీరియల్ కు కార్తీకదీపం 2 నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా.. తొలి స్థానాన్ని మాత్రం అందుకోలేకపోతోంది.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే
స్టార్ మా ఛానెల్ సీరియల్స్ ను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో తాజా రేటింగ్స్ మరోసారి నిరూపించాయి. టాప్ 10లో ఏకంగా ఆరు ఈ ఛానెల్ కు చెందినవే కాగా.. టాప్ 5లో మొత్తం స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. ఎప్పటిలాగే అర్బన్, రూరల్ కలిపి తొలి స్థానంలో 12.64 రేటింగ్ తో బ్రహ్మముడి ఉంది. 37వ వారంతో పోలిస్తే ఈ సీరియల్ రేటింగ్స్ కాస్త పెరగడం విశేషం.
ఇక 11.57 రేటింగ్ తో కార్తీకదీపం 2 రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో 10.68 రేటింగ్ తో గుండెనిండా గుడిగంటలు ఉండగా.. 10.12 రేటింగ్ తో ఇంటింటి రామాయణం నాలుగో స్థానంలో, 9.03 రేటింగ్ తో చిన్నీ ఐదో స్థానంలో ఉన్నాయి. స్టార్ మాలో వచ్చే మగువ ఓ మగువ (6.99), పలుకే బంగారమాయెనా (5.12), నువ్వు నేను ప్రేమ (5.03) కూడా మంచి రేటింగ్స్ సాధించాయి.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగు సీరియల్స్ ఈసారి కూడా స్టార్ మాతో పోటీ పడలేకపోయాయి. ఆ ఛానెల్లో వచ్చే పడమటి సంధ్యారాగం 7.62 రేటింగ్ సాధించింది. ఈ ఛానెల్లో ఇదే అత్యధికం కావడం విశేషం.
ఇక ఆ తర్వాత వరుసగా మేఘ సందేశం (6.93), నిండు నూరేళ్ల సావాసం (6.72), జగద్ధాత్రి (6.68), త్రినయని (6.59), అమ్మాయిగారు (5.48) ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే టాప్ 10 తెలుగు సీరియల్స్ లో జీ తెలుగుకు చెందిన పడమటి సంధ్యారాగం ఆరో స్థానంలో నిలిచింది.
ఈటీవీ, జెమిని టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
సీరియల్స్ విషయంలో ఈటీవీ, జెమిని టీవీలు పూర్తిగా వెనుకబడిపోతున్నాయి. ఈటీవీలో వచ్చే రంగుల రాట్నం సీరియల్ కు అత్యధికంగా 3.33 రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఛానెల్ కు చెందిన మనసంతా నువ్వే (3.04), గువ్వగోరింక (2.93), రావోయి చందమామ (2.52) ఉన్నాయి.
జెమినీ టీవీ విషయానికి వస్తే.. ఆ ఛానెల్లో వచ్చే శ్రీమద్ రామాయణం 1.21 రేటింగ్ తో టాప్ లో నిలిచింది. ఆ తర్వాత కొత్తగా రెక్కలొచ్చెనా (1.05), సివంగి (0.85), అర్ధాంగి (0.84), భైరవి (0.82) ఉన్నాయి. ఈ రెండు ఛానెల్స్ కు చెందిన సీరియల్స్ చాలా ఏళ్లుగా అసలు టాప్ 10 సీరియల్స్ జాబితాలోనే లేకుండా పోయాయి.