NNS September 26th Episode: అమర్ భాగీ రొమాన్స్.. బాధపడిన మనోహరి.. అరవింద్‌పై డౌట్.. సింగ్‌గా మారిన రాథోడ్-nindu noorella saavasam serial september 26th episode manohari feelt bad of bhagi nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 26th Episode: అమర్ భాగీ రొమాన్స్.. బాధపడిన మనోహరి.. అరవింద్‌పై డౌట్.. సింగ్‌గా మారిన రాథోడ్

NNS September 26th Episode: అమర్ భాగీ రొమాన్స్.. బాధపడిన మనోహరి.. అరవింద్‌పై డౌట్.. సింగ్‌గా మారిన రాథోడ్

Sanjiv Kumar HT Telugu
Sep 26, 2024 09:52 AM IST

Nindu Noorella Saavasam September 26th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌‌లో అమర్ భాగీ వెళ్తుంటే కారు చెడిపోతుంది. దాంతో రోడ్డుపై ఆగిపోతారు ఇద్దరు. తర్వాత సింగ్ రూపంలో వచ్చిన రాథోడ్ వారికి స్కూటర్ ఇస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 26th September Episode) బాబ్జీ లోకేషన్‌ షేర్‌ చేయగానే మనోహరి అక్కడకు వెళ్లేందుకు బయల్దేరుతుంది. మనోహరితో పాటు అరుంధతి కూడా వెళ్తుంది. రాథోడ్‌ సింగ్‌ వేషం వేసుకుని అమర్‌ వాళ్ల దగ్గరకు వెళ్లి భాగీతో నిజం చెప్పాలని బయలుదేరుతాడు.

శివరామ్, నిర్మల టెన్షన్‌ పడుతూ రాథోడ్‌‌కు ఫోన్‌ చేస్తారు. వాళ్ల దగ్గరకే వెళ్తున్నాను మీరు పకోడి తిని పడుకోండి అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు రాథోడ్. కారులో వెళ్తున్న భాగీ ఏదేదో మాట్లాడుతుంటే అమర్‌ సీరియస్‌‌గా మిస్సమ్మ ఫ్లీజ్‌ నీ స్పీకర్‌‌ను ఆఫ్‌ చేసి కొంచెం సైలెంట్‌‌గా ఉండవా? అని అడుగుతాడు. సరదాగా బయటకు వచ్చినప్పుడు కూడా సైలెంట్‌‌గా ఉండమంటారేంటి? అంటుంది భాగీ.

క్యాబ్‌లో వెళ్లొచ్చు కదా

అంటే నువ్వు సరదాగా మాట్లాడుతున్నట్లు లేదు. కక్షగట్టుకుని గట్టిగా మాట్లాడుతున్నట్లు ఉంది. పాపం నీ నోటికి నా చెవులకు కొంచెం బ్రేక్‌ ఇవ్వు అంటాడు అమర్​. కారులో పాటలు పెట్టకూడదు. మాట్లాడకూడదు ఇంకెందుకు కలిసి వెళ్లడం. అయినా కారులో నేను క్యాబ్‌‌లో వెళ్లొచ్చు కదా? అని భాగీ మెల్లిగా అనుకుంటుంది. వినిపిస్తుంది అంటాడు అమర్​.

ఆ వినిపించాలనే అన్నాను. చూస్తే భయపడే రోజుల పోయాయి. నన్ను కాదు రోడ్డును చూసి డ్రైవ్‌ చేయండి అని బాధగా చెప్తుంది భాగీ. ఇంతలో కారు ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్‌ కాదు అని భాగీ కారు దిగి బయటకు వెళ్తుంది. అమర్‌ వచ్చి ఏయ్‌ లూజ్‌ కారులో కూర్చో అంటూ తిడతాడు. నేను కూర్చోను అంటుంది.

అమర్‌‌ను ఫాలో

బాబ్జీ పెట్టిన లొకేషన్‌‌కు వెళ్తుంది మనోహరి. మను పాస్టుగా వెళ్లు అని అరుంధతి అనుకుంటుంది. మరోవైపు అమర్‌‌ను ఫాలో అవుతూ వచ్చిన అరవింద్‌ కారు ఆగిపోతూ ఉండటం చూసి నేను ఫాలో అవడం చూసి ఆగిపోయాడా? అని ఆలోచిస్తుంటాడు. అమర్‌ కూడా ఈ బండి ఏంటి చాలా సేపటి నుంచి ఫాలో అవుతుంది. అరవింద్‌ అయ్యుంటాడా? అనుకుంటాడు.

అరవింద్‌ మాత్రం ఇప్పుడు దొరికతే చాలా కష్టం అని బైక్‌ తీసుకుని హెల్మెట్‌ పెట్టకుని వెళ్లిపోతాడు. బాబ్జీ మనోహరికి ఫోన్‌ చేస్తాడు. హలో నువ్వు చెప్పిన హైవేలోనే వస్తున్నాను. ఎక్కడ వాళ్లు కనిపించడం లేదు అంటుంది మనోహరి. మేడమ్ అమరేంద్ర సార్‌ కారు చెడిపోయినట్టు ఉంది. ఆయన, ఆమె కలిసి అందరినీ లిఫ్ట్‌ అడుగుతున్నారు అంటాడు బాబ్జీ. ఏంటి లిఫ్ట్‌ అడుగుతున్నారా? అంటుంది మనోహరి.

బొమ్మలా కూర్చుండిపోయింది

ఇప్పుడు కానీ మిమ్మల్ని చూస్తే మొదటికే మోసం వస్తుంది. వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతే నాకు మళ్లీ కాల్‌ చేయ్‌ అని ఆగిపోతుంది మనోహరి. ఇదేంటి మనోహరి ఇలా బొమ్మలా కూర్చుండి పోయింది. అక్కడ మిస్సమ్మ పరిస్థితి ఏంటో..? రాథోడ్‌ వెళ్లి మిస్సమ్మకు విషయం చెప్పినా బాగుండు అనుకుంటుంది అరుంధతి.

సింగ్​ వేషంలో రాథోడ్ స్కూటర్‌ మీద వెళ్తు.. సారు, మిస్సమ్మ రోడ్డు మీద ఎక్కడా కనిపించడం లేదేంటి? అనుకుంటాడు. అతనెవరో హైవే ఎక్కక ముందు నుంచే ఫాలో అవుతున్నాడు. ముఖం కనిపించకుండా హెల్మెట్‌ పెట్టుకుని లిఫ్ట్‌ అడిగినప్పుడు మా ముఖం కూడా చూడలేదు. ఛ.. టైంకి కారు ట్రబుల్‌ ఇచ్చింది లేదంటే వాడి వెనకే వెళ్లి వాడు అరవిందో కాదో కనుక్కునే వాడిని అని మనసులో అనుకుంటాడు అమర్​.

బోర్‌ కొడుతుంది. ఏదైనా మాట్లాడండి. పోనీ పోట్లాడండి అప్పుడైనా టైం పాస్‌ అవుతుంది భాగీ. ఇంతలో రాథోడ్‌ వస్తాడు. సారు వాళ్లు ఏంటి కారు పక్కకు ఆపి రోడ్డు మీద నిలబడ్డారు అనుకుని మిస్సమ్మకు ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటాడు. వెళ్లి తను వచ్చిన స్కూటర్‌ తీసుకుని మీరు వెళ్లండి అని చెప్తాడు. అమర్‌ వద్దని చెప్తాడు. భాగీ వెళ్దామని బలవంతం చేయగానే సరేనని అమర్‌, భాగీని తీసుకుని స్కూటర్‌ మీద వెళ్లిపోతారు.

అమర్ భాగీ రొమాన్స్

బాబ్జీ మనోహరికి ఫోన్‌ చేసి వాళ్లు స్కూటర్‌ మీద వెళ్లిపోయారు అని చెప్తాడు. దీంతో మనోహరి బాధపడుతుంది. అమర్‌, భాగీ ఇద్దరూ రొమాన్స్‌ చేసుకున్నట్లు కలగంటుంది. మరోవైపు అమర్‌ వెనకాల వెళ్లడానికి లిఫ్ట్‌ అడుగుతుంటాడు బాబ్జీ. ఇంతలో మనోహరి కారు చూసి ఎదురుగా వెళ్తాడు బాబ్జీ. లిఫ్ట్‌ అడిగి కారు ఎక్కి వెళ్తాడు.

మనోహరి కల నిజం అవుతుందా? అరవింద్​ మిస్సమ్మను చంపాలని వేసిన ప్లాన్​ వర్కౌట్​ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్​ 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!