Satya Prakash: కర్తవ్యంలో విజయశాంతిలా అనుకుంటారు.. స్టార్ హీరో భార్యపై టాలీవుడ్ విలన్ కామెంట్స్-satya prakash comments on priyanka upendra in ugravatharam trailer release event tollywood villain satya prakash ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satya Prakash: కర్తవ్యంలో విజయశాంతిలా అనుకుంటారు.. స్టార్ హీరో భార్యపై టాలీవుడ్ విలన్ కామెంట్స్

Satya Prakash: కర్తవ్యంలో విజయశాంతిలా అనుకుంటారు.. స్టార్ హీరో భార్యపై టాలీవుడ్ విలన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Satya Prakash Comments On Priyanka Upendra: కర్తవ్యంలో విజయశాంతిలా అనుకుంటారని కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్రపై టాలీవుడ్ విలన్ సత్య ప్రకాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రియాంక ఉపేంద్ర యాక్షన్ సినిమా ఉగ్రావతారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌లో ఇలా మాట్లాడారు.

కర్తవ్యంలో విజయశాంతిలా అనుకుంటారు.. స్టార్ హీరో భార్యపై టాలీవుడ్ విలన్ కామెంట్స్

Satya Prakash Comments On Priyanka Upendra: కన్నడ నాట స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ఉపేంద్ర. ఏ, ఉపేంద్ర వంటి ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేశారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర పలు చిత్రాలతో అట్రాక్ట్ చేశారు. అయితే, ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర కూడా కన్నడ నాట హీరోయిన్‌గా, నటిగా ఎంతో పాపులర్.

ప్రియాంక లీడ్ రోల్‌లో

ప్రియాంక ఉపేంద్ర నటించిన పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ఉగ్రావతరాం. ఈ చిత్రానికి ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో సతీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉగ్రావతారం సినిమాకు గురుమూర్తి దర్శకత్వం వహించారు. ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో ఇంకా నటుడు సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు.

ట్రైలర్ లాంచ్ అండ్ సాంగ్ రిలీజ్

ఇటీవల ఉగ్రావతారం మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉగ్రావతారం ట్రైలర్ లాంచ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి సందడి చేశారు. కరాటే రాజు, సత్య ప్రకాష్ ఉగ్రావతారం పాటను రిలీజ్ చేయగా.. రాజ్ కందుకూరి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

కలకత్తా బిడ్డ

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టాలీవుడ్ విలన్, నటుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. "కలకత్తా కాళి గురించి అందరికీ తెలిసిందే. మన ప్రియాంక గారు కలకత్తా బిడ్డ. కర్తవ్యంలో విజయశాంతి గారిని చూసి ఎలా అనుకున్నారో.. ఈ మూవీ తరువాత ప్రియాంక గారిని అలా అనుకుంటారు" అని అన్నారు.

నా కొడుకు కూడా

"ఈ మూవీ తరువాత ప్రతీ ఇంట్లోకి ప్రియాంక గారు వెళ్తారు. మనమంతా కలిసి ఆమెను సపోర్ట్ చేద్దాం. ఈ చిత్రంలో నా కొడుకు నటించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. గురుమూర్తి చాలా డెడికేటెడ్ డైరెక్టర్. నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి" అని నటుడు సత్య ప్రకాష్ తెలిపారు.

సినిమాల్లో విలన్‌గా

కాగా సత్య ప్రకాష్ తెలుగు సినిమాల్లో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోకిరి, 90 ఎమ్ఎల్, లక్ష్మీ, మాస్టర్ ఇతర చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్య ప్రకాష్. ఇదిలా ఉంటే, ఇదే కార్యక్రమంలో నటరాజ్ మాట్లాడుతూ.. "సతీష్ గారు నిర్మించిన ఈ చిత్రానికి ప్రియాంక ఉపేంద్ర గారు సమర్పకురాలు. గురుమూర్తి గారు ఈ మూవీని అద్భుతంగా రాసుకుని తెరకెక్కించారు" అని అన్నారు.

కంటెంటె బేస్‌డ్ మూవీ

"నంద కుమార్ మంచి విజువల్స్ ఇచ్చారు. కృష్ణ బస్రూర్ సంగీతం అదిరిపోతుంది. ఇది కంటెంట్ బేస్‌డ్ మూవీ. మహిళలకు జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలను అమ్మవారు వచ్చి కాపాడితే ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో ఉంటుంది. ప్రియాంక గారు అద్భుతంగా నటించారు. మా చిత్రం నవంబర్ 1న రాబోతోంది. అందరూ చూడండి" అని నటరాజ్ కోరారు.