OTT Thriller: ఓటీటీలోకి అడ్వెంచర్ థ్రిల్లర్- దగ్గుబాటి రానా సపోర్ట్- 240 దేశాల్లో, 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?-daggubati rana released snakes and ladders trailer ott dark humor thriller snakes and ladders ott release amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller: ఓటీటీలోకి అడ్వెంచర్ థ్రిల్లర్- దగ్గుబాటి రానా సపోర్ట్- 240 దేశాల్లో, 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

OTT Thriller: ఓటీటీలోకి అడ్వెంచర్ థ్రిల్లర్- దగ్గుబాటి రానా సపోర్ట్- 240 దేశాల్లో, 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

Daggubati Rana Support To Snakes And Ladders OTT Release: ఓటీటీలోకి తమిళ డార్క్ హ్యూమర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ రానుంది. ఈ సిరీస్‌కు దగ్గుబాటి రానా సపోర్ట్‌గా నిలుస్తూ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ట్రైలర్, దాని ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి అడ్వెంచర్ థ్రిల్లర్- దగ్గుబాటి రానా సపోర్ట్- 240 దేశాల్లో, 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Daggubati Rana Support To OTT Thriller Web Series: బాహుబలి ఫేమ్ హీరో రానా దగ్గుబాటి అద్భుతమైన నటనతో పాపులర్ అయ్యాడు. హీరోగా పలు సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూనే న్యూ టాలెంట్‌ను, డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇతర భాషా చిత్రాలను తమ సంస్థ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తూనే చిన్న చిత్రాలను నిర్మాణంలో సహాకారం అందిస్తున్నాడు రానా.

దగ్గుబాటి రానా సపోర్ట్

అలాగే, ఓటీటీ కంటెంట్‌ మూవీస్, వెబ్ సిరీస్‌లకు సపోర్ట్‌గా నిలుస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు దగ్గుబాటి రానా. తాజాగా దగ్గుబాటి రానా సపోర్ట్ చేస్తున్న వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. డార్క్ హ్యూమర్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను తాజాగా దగ్గుబాటి రానా విడుదల చేశాడు.

చూసేందుకు సిద్ధమా

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు దగ్గుబాటి రానా. "అడుగునా ప్రమాదం పొంచి ఉంది. ఈ వైకుంఠపాళి ఆట చూడడానికి మీరు సిద్ధమా? ట్రైలర్ వచ్చేసింది" అని క్యాప్షన్ రాసుకొచ్చిన రానా దగ్గుబాటి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ట్రైలర్ లింక్‌ను పొందుపరిచాడు.

ముగ్గురు డైరెక్టర్స్

ఇక ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్ సిరీస్‌కు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ ముగ్గురు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను ఏ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్ బ్యానర్‌లపై కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మిస్తున్నారు.

9 ఎపిసోడ్స్‌తో

తొమ్మిది ఎపిసోడ్‌లతో తెరకెక్కిన ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్ సిరీస్‌ తమిళ ఒరిజినల్ సిరీస్‌గా రూపొందింది. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, స్రింద, శ్రీజిత్ రవి, సమ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్యకుమార్, తరుణ్, సాషా భరేన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అమ్మాయి అరుపు

స్కూల్‌లో ఆకతాయితనం చేసే ఐదుగురు విద్యార్థులు ఎవరికి చెప్పకుండా రాత్రి అడవి దారిలో వెళ్తుంటారు. ఆ సమయంలో అడవిలో నుంచి ఓ అమ్మాయి అరుపు వినిపించడంతో అటువైపు వెళ్తారు. అక్కడ వారికి కొన్ని కోట్ల విలువ గల డాలర్ దొరుకుతుంది. ఆ డాలర్ పోగొట్టుకున్న ముఠా ఆ ఐదుగురు విద్యార్థుల వెంట పడుతుంది.

అడ్వెంచర్ థ్రిల్లర్

ఆ ముఠా నుంచి, పోలీసుల నుంచి ఐదుగురు పిల్లలు ఎలా తప్పించుకున్నారనేదే స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్ సిరీస్ కథాంశంగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అడవిలో పిల్లలు చేసే అడ్వెంచర్, థ్రిల్లింగ్ సీన్స్, మంచి బీజీఎమ్, సినిమాటోగ్రఫీతో ఆద్యంతం ట్రైలర్ ఆకట్టుకుంది. హీరో నవీన్ చంద్ర రోల్ స్పెషల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

240 దేశాల్లో ఓటీటీ స్ట్రీమింగ్

ఇక ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్ సిరీస్ అక్టోబర్ 18 అంటే రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తమిళంలో డార్క్ హ్యూమర్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌గా రూపొందిన స్నేక్స్ అండ్ ల్యాడర్స్ 240 దేశాల్లో ఓటీటీ రిలీజ్ కానుంది. అది కూడా తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.