Neethone Dance Latest Promo: శ్రీముఖిపై నటరాజ్ మాస్టర్ సీరియస్.. ఆట సందీప్ వెర్సెస్ అమర్.. అదిరిన నీతోనే డ్యాన్స్ ప్రోమో-neethone dance race finale latest promo released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Neethone Dance Latest Promo: శ్రీముఖిపై నటరాజ్ మాస్టర్ సీరియస్.. ఆట సందీప్ వెర్సెస్ అమర్.. అదిరిన నీతోనే డ్యాన్స్ ప్రోమో

Neethone Dance Latest Promo: శ్రీముఖిపై నటరాజ్ మాస్టర్ సీరియస్.. ఆట సందీప్ వెర్సెస్ అమర్.. అదిరిన నీతోనే డ్యాన్స్ ప్రోమో

Hari Prasad S HT Telugu
Aug 15, 2023 02:30 PM IST

Neethone Dance Latest Promo: శ్రీముఖిపై నటరాజ్ మాస్టర్ సీరియస్ అయ్యాడు. ఎంతమంది మధ్య గొడవలు పెడతావ్ అని నిలదీశాడు. అటు ఆట సందీప్ వెర్సెస్ అమర్ గొడవ ముదిరింది. నీతోనే డ్యాన్స్ లేటెస్ట్ ప్రోమో వీకెండ్ ఎపిసోడ్లపై ఆసక్తి రేపేలా ఉంది.

నీతోనే డ్యాన్స్ ప్రోమోలో శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నటరాజ్ మాస్టర్
నీతోనే డ్యాన్స్ ప్రోమోలో శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నటరాజ్ మాస్టర్

Neethone Dance Latest Promo: స్టార్ మా ఛానెల్లో వస్తున్న నీతోనే డ్యాన్స్ సెమీ ఫైనల్స్ కు చెందిన ప్రోమో సోమవారం (ఆగస్ట్ 14) రిలీజైంది. రేస్ టు ఫినాలే అంటూ ఈ రాబోయే వీకెండ్ లో జరగబోయే ఎపిసోడ్లపై ఎంతో ఆసక్తి రేపేలా ఈ ప్రోమో సాగింది. ముఖ్యంగా శ్రీముఖి, నటరాజ్ మాస్టర్ ఎపిసోడ్.. ఆట సందీప్ వెర్సెస్ అమర్.. చివర్లో జడ్జ్ సదాను భయపెట్టిన అంజలి, పవన్ డ్యాన్స్ లతో ప్రోమో అదిరేలా ఉంది.

వచ్చే శని, ఆదివారాల్లో టెలికాస్ట్ కానున్న నీతోనే డ్యాన్స్ ఎపిసోడ్లలో డిఫరెంట్ థీమ్స్ తో డ్యాన్సర్లు అదరగొట్టారు. దేశభక్తి థీమ్ తోపాటు పైరేట్స్ ఆఫ్ కరీబియన్ థీమ్, కేజీఎఫ్ థీమ్ లాంటివి జడ్జ్ లను ఆకట్టుకున్నాయి. ఇక ప్రోమో చివర్లో పవన్, అంజలి చేసిన దెయ్యం థీమ్ డ్యాన్స్ జడ్జి సదాను భయంతో వణికిపోయేలా చేసింది. ఆమె గట్టిగా అరుస్తూ.. ఇక చాలు ఆపండని వేడుకోవడం విశేషం.

సందీప్ వెర్సెస్ అమర్

ఈ ప్రోమోలో ఆట సందీప్, అమర్ మధ్య గొడవ జరిగింది. డ్యాన్స్ చేస్తూ జ్యోతి కాస్త జారినట్లు అమర్ చెబుతాడు. దీంతో సందీప్, అమర్ మధ్య గొడవ మొదలవుతుంది. సందీప్ డ్యాన్స్ జడ్జీలకు నచ్చినా.. అమర్ మాత్రం కేవలం 5 మార్కులే ఇవ్వడంపై అతడు అసహనం వ్యక్తం చేస్తాడు. చివర్లో డ్యాన్స్ సరిగా నేర్చుకో.. సిగ్గుండాలి అంటూ జ్యోతిపై సందీప్ మండిపడటం గమనార్హం.

శ్రీముఖితో నటరాజ్ మాస్టర్ గొడవ

ఇక నీతోనే డ్యాన్స్ యాంకర్ శ్రీముఖిపై నటరాజ్ మాస్టర్ మండిపడటం కూడా ఈ ప్రోమోలో కనిపిస్తుంది. ఎంతమంది మధ్య గొడవలు పెడతావ్ అంటూ శ్రీముఖిపై నటరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేజ్ పై నుంచి వెళ్లిపోతాడు. సొంత బయోపిక్ ఎలా తీయాలి.. ఆ టార్చర్ పెట్టే అమ్మాయి అంజలి అయి ఉంటే బాగుండేదని శ్రీముఖి అనడంతో నటరాజ్ సీరియస్ అవుతాడు. అసలు నీకేం కావాలి.. మార్కులు తక్కువ రావాలని అలా చేస్తున్నావా అంటూ శ్రీముఖిపై మండిపడతాడు.

మొత్తానికి నీతోనే డ్యాన్స్ రేస్ టు ఫినాలే ఉత్కంఠ రేపుతోంది. ఫైనల్ చేరడానికి అన్ని టీమ్స్ సర్వశక్తులూ ఒడ్డి డ్యాన్స్ చేస్తున్నాయి. దీంతో గొడవలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. అదిరిపోయే డ్యాన్స్ లు, గొడవలతో ఈ వీకెండ్ నీతోనే డ్యాన్స్ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Whats_app_banner