Priyanka Upendra: మా ఆయన్నుఇక్కడే తొలిసారి కలిసా.. నాకు చాలా లక్కీ సిటీ.. హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక కామెంట్స్-priyanka upendra comments on hyderabad in ugravatharam trailer launch kannada star hero upendra wife priyanka speech ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyanka Upendra: మా ఆయన్నుఇక్కడే తొలిసారి కలిసా.. నాకు చాలా లక్కీ సిటీ.. హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక కామెంట్స్

Priyanka Upendra: మా ఆయన్నుఇక్కడే తొలిసారి కలిసా.. నాకు చాలా లక్కీ సిటీ.. హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Priyanka Upendra About Ugravatharam Trailer Launch: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ ఉగ్రావతారం. తాజాగా ఉగ్రావతారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఉపేంద్ర భార్య, హీరోయిన్ ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మా ఆయన్నుఇక్కడే తొలిసారి కలిసా.. నాకు చాలా లక్కీ సిటీ.. హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక కామెంట్స్

Priyanka Upendra Comments: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సతీమణి, హీరోయిన్ ప్రియాంక ఉపేంద్ర నటించిన పాన్ ఇండియన్ యాక్షన్ చిత్రం ఉగ్రావతారం. ప్రియాంక ఉపేంద్ర మెయిన్ లీడ్ రోల్ చేయగా.. సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ట్రైలర్ రిలీజ్, పాట లాంచ్

ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్‌జీ సతీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉగ్రావతారం సినిమాకు గురుమూర్తి దర్శకత్వం వహించారు. నవంబర్ 1న ఉగ్రావతారం సినిమా విడుదల కానుంది. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్ పాటను విడుదల చేశారు. అలాగే, నిర్మాత రాజ్ కందుకూరి ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

దసరాకు వస్తే

ఉగ్రావతారం ట్రైలర్ లాంచ్‌లో నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. "ఉగ్రావతారం వంటి కంటెంట్ దసరాకి రావాల్సిన సినిమా. ఫీమేల్ ఓరియెంటెడ్‌గా తీసిన ఈ చిత్రం దసరాకి వస్తే ఇంకా బాగుండేది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిని చూపిస్తూ తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. గురుమూర్తి ఇది వరకు తీసిన చిత్రాలు కూడా బాగుంటాయి. నవంబర్ 1న రాబోతోన్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ప్రియాంక ఉపేంద్రకు మంచి సక్సెస్ రావాలి. ఇలాంటి చిత్రాలను మీడియా ముందుండి నడిపించాలి" అని అన్నారు.

ఆయన వల్లే చేశాను

"నాకు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఉపేంద్ర గారిని ఫస్ట్ టైమ్ ఇక్కడే కలిశాను. హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరిర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. గురుమూర్తి గారి వల్లే ఈ మూవీని చేశాను. నేను ఈ పాత్రకు సెట్ అవుతాను అని ఆయనే నమ్మారు. కెమెరామెన్ నందకుమార్ అందరినీ బాగా చూపించారు" అని హీరోయిన్ ప్రియాంక ఉపేంద్ర తెలిపారు.

మంచి మ్యూజిక్ ఇచ్చారు

"నటరాజ్ అద్భుతంగా నటించాడు. రాజు గారు తెలుగులో మంచి పాటలు, మాటలు ఇచ్చారు. కృష్ణ బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవంబర్ 1న మా చిత్రం రాబోతోంది. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడండి" అని ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర కోరారు.

అఘాయిత్యాల పైనే

గురుమూర్తి మాట్లాడుతూ.. "సమాజంలో జరిగే అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని మీడియా ప్రశ్నించి ఎదురించగలదు. మా ఈ చిత్రాన్ని అటువంటి సమస్యల మీదే తీశాను. మంచి సందేశాత్మాక చిత్రంగా ఉంటుంది. ప్రియాంక మేడం కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. నవంబర్ 1న రానున్న మా చిత్రాన్ని అందరూ చూడండి" అని అన్నారు.

పెద్ద హిట్ అవ్వాలి

"ప్రస్తుతం సినిమాకు భాష లేదు. కంటెంట్ బాగుంటే అన్ని భాషల ఆడియెన్స్ చూస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 1న రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి" అని హీరో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు చెప్పారు.