Salaar Trailer Twitter Review: సలార్ ట్రైలర్‌పై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే!
Salaar Trailer Twitter Review: సలార్ ట్రైలర్‌పై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. బ్లాక్‍బాస్టర్ రెడీ అయిందంటూ చాలా మంది పోస్టులు చేస్తున్నారు. కొందరేమో ఓ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలివే..
Salaar Trailer Twitter Review: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘సలార్: పార్ట్ 1- సీజ్‍ఫైర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. అందరూ నిరీక్షిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ యూనిట్ నేడు (డిసెంబర్ 1) రిలీజ్ చేసింది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య ఫ్రెండిషిప్ ఎమోషన్, యాక్షన్ సీక్వెన్సులతో సలార్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మార్క్ స్పష్టంగా కనిపించింది. కాగా, సలార్ ట్రైలర్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సలార్ ట్రైలర్ అదిరిపోయిందని, ప్రభాస్ దద్దరిల్లిపోయే కమ్‍బ్యాక్ ఇవ్వడం ఖాయమని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సలార్ సునామీలో గత బాక్సాఫీస్ రికార్డులన్నీ కొట్టుకుపోతాయని మరికొందరు ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ట్రైలర్లో ప్రభాస్ యాక్షన్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారు. డిసెంబర్ 22న థియేటర్లలో యాక్షన్ పండగే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ నిరాశను మరిచిపోయేలా సలార్ బ్లాక్‍బాస్టర్ అవుతుందని చాలా మంది ఆశిస్తున్నారు.
మరోవైపు సలార్ ట్రైలర్‌పై కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అంచనా వేసిన రేంజ్‍లో లేదని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కథను అంతగా రివీల్ చేయకుండా ఎక్కువ యాక్షన్ సీన్లను చూపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, సలార్ ట్రైలర్లో ప్రభాస్ డైలాగ్ డెలివరీపైనా కొందరు అసంతృప్తి చెందుతున్నారు. ప్రభాస్ డైలాగ్స్ సరిగా చెప్పలేదని అంటున్నారు. ఈ విషయంపై కొందరు ట్రోల్స్ కూడా మొదలుపెట్టేశారు.
కన్నడ మూవీ ఉగ్రంతో సలార్‌ను మరోసారి పోలుస్తున్నారు కొందరు నెటిజన్లు. తన ఉగ్రం సినిమానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ పేరుతో రీమేక్ చేస్తున్నారంటూ పోస్టులు చేస్తున్నారు. స్నేహితుల మధ్య బంధం, గ్యాంగ్‍స్టర్ల బ్యాక్‍డ్రాప్ అంతా ఉగ్రంలానే అనిపిస్తోందని ట్వీట్లు చేస్తున్నారు. గతంలోనూ సలార్.. ఉగ్రంకు రీమేక్ అని వార్తలు రాగా, మేకర్స్ వాటిని కొట్టిపడేశారు. అయితే, ఇప్పుడు ట్రైలర్ రావడంతో సలార్, ఉగ్రం చిత్రాలను మళ్లీ పోలుస్తున్నారు కొందరు నెటిజన్లు.
సలార్ ట్రైలర్లో కేజీఎఫ్ చారలు కూడా కనిపిస్తున్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రం, కేజీఎఫ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే, ఎక్కువ మంది నెటిజన్లు మాత్రం సలార్ ట్రైలర్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‍కు భారీ బ్లాక్‍బాస్టర్ పక్కా అంటూ ధీమాగా చెబుతున్నారు.
సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్ సినిమా డిసెంబర్ 22వ తేదీ థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమింళం మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ పోటీగా వస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ జరగనుంది.
సలార్ మూవీలో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి కీలకపాత్రలు పోషించారు. రవిబస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు.
సంబంధిత కథనం