Salaar Trailer: సలార్ ట్రైలర్ వచ్చేసింది.. గూజ్‍బంప్స్ తెప్పించేలా యాక్షన్, ఎమోషన్: చూసేయండి-salaar trailer released with high octane actions scenes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Trailer: సలార్ ట్రైలర్ వచ్చేసింది.. గూజ్‍బంప్స్ తెప్పించేలా యాక్షన్, ఎమోషన్: చూసేయండి

Salaar Trailer: సలార్ ట్రైలర్ వచ్చేసింది.. గూజ్‍బంప్స్ తెప్పించేలా యాక్షన్, ఎమోషన్: చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2023 07:58 PM IST

Salaar Trailer: సలార్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్లో హీరో ప్రభాస్ యాక్షన్ సీన్లు గూజ్‍బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ట్రైలర్ అంచనాలకు మించి అన్నట్టుగా ఉంది.

Salaar Trailer: సలార్ ట్రైలర్ వచ్చేసింది.. గూజ్‍బంప్స్ తెప్పించేలా యాక్షన్, ఎమోషన్
Salaar Trailer: సలార్ ట్రైలర్ వచ్చేసింది.. గూజ్‍బంప్స్ తెప్పించేలా యాక్షన్, ఎమోషన్

Salaar Trailer: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ ‘సలార్’ ట్రైలర్ నేడు (డిసెంబర్ 1) రిలీజ్ అయింది. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై క్రేజ్ పీక్స్‌లో ఉంది. రికార్డులను బద్దలుకొట్టి బాక్సాఫీస్‍ను ఈ మూవీ షేక్ చేయడం పక్కా అనే అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22వ తేదీన ‘సలార్: పార్ట్ 1- సీజ్‍ఫైర్’ విడుదల కానుండగా.. నేడు (డిసెంబర్ 1) ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

సలార్ ట్రైలర్ దద్దరిల్లిపోయే యాక్షన్, ఎమోషన్ సీన్లతో గూజ్‍బంప్స్ తెప్పించేలా ఉంది. యాక్షన్ మోడ్‍లో ప్రభాస్ అదరగొట్టారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ స్నేహితులుగా ఈ ట్రైలర్‌లో చూపించారు మేకర్స్. వారు చిన్నతనంలో స్నేహంగా ఉన్న సీన్‍తో ట్రైలర్ షురూ అయింది. ఖాన్సార్ సామ్రాజ్యం కోసం జరిగే పోరాటాలే ఈ మూవీ ప్రధాన కథగా ఉన్నట్టు అర్థమవుతోంది.

చిన్నతనం నుంచే దేవ (ప్రభాస్), వరదరాజ్ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య స్నేహం ఉంటుంది. అయితే, చిన్నతనంలోనే వారు విడిపోతారు. “నీ కోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతా.. నీ ఒక్కడి కోసం.. నువ్వు ఎప్పుడు పిలిచినా ఇక్కడికి వస్తా” అని చెప్పి దేవ వెళ్లిపోతాడు. వెయ్యేళ్ల క్రితం క్రూరమైన బందిపోట్లు పాలించిన ఖాన్సార్.. కోట ఆ తర్వాత సామ్రాజ్యం అయిందని ట్రైలర్లో ఉంది. ఇప్పుడు కూడా ఖాన్సార్ కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవంటూ వాయిస్ ఓవర్ కొనసాగింది. ఖాన్సార్‌ను పాలించే రాజమన్నార్‌గా జగపతి బాబు కనిపించారు. తన కుమారుడు వరదరాజ్‍ను దొరగా తన ప్లేస్‍లోకి రావాలని కోరుకుంటాడు. అయితే, ఇప్పటికే వరదరాజ్‍ను చంపేందుకు కొన్ని గ్రూప్‍లు కుట్ర పన్ని దాడి చేస్తాయి. ఖాన్సార్‌ను స్వాధీనం చేసుకుంటాయి.

వరదరాజ్ మళ్లీ ఖాన్సార్‌ను స్వాధీనం చేసుకునేందుకు దేవ (ప్రభాస్) సాయం కోరివస్తాడు. తననే ఆర్మీగా భావిస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ యాక్షన్ సీన్లు అదరిపోయాయి. “పెద్దపెద్ద గోడలు కట్టేదే భయపడి.. బయటికి ఎవరు పోతాడు.. లోపలికి ఎవడు వస్తాడని” అంటూ ప్రభాస్ డైలాగ్ ఉంది. ‘ముట్టుకోవద్దని చెప్పాను కదరా’ అని ప్రభాస్ అంటే “నా కళ్ల ముందు ఉన్నదంతా నాకు కావాలి” అని పృథ్విరాజ్ అంటాడు. “నిన్నెవడూ ముట్టుకోకూడదు” అని ప్రభాస్ డైలాగ్ ఉంది. ‘ప్లీజ్.. ఐ కైండ్లీ.. రిక్వెస్ట్’ అనే డైలాగ్‍తో ‘సలార్: పార్ట్ 1- సీజ్ ఫైర్’ ట్రైలర్ ముగిసింది. 3 నిమిషాల 47 సెకన్ల పాటు ఉన్న సలార్ ట్రైలర్ సూపర్‌గా ఉంది. రవి బస్రూర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఇంటెన్స్‌గా సాగింది. 

సలార్ ట్రైలర్ ఐదు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ వచ్చింది.

గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా సలార్ రూపొందింది. సలార్‌గా ప్రభాస్, వరదరాజ మన్నార్‌గా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో నటించారు. శృతి హాసన్ హీరోయిన్‍గా చేయగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి, రామచంద్ర రాజు కీలక పాత్రలు పోషించారు.

హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్.. సలార్ చిత్రాన్ని నిర్మించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.