Salaar First Single: సలార్ తొలి పాట వచ్చేసింది.. ఎమోషనల్‍గా ఫ్రెండ్‍షిప్ సాంగ్
Salaar First Single: సలార్ సినిమా నుంచి మొదటి పాట వచ్చేసింది. దేవ, వరదరాజ్‍ల మధ్య స్నేహం గురించి ఈ సాంగ్ ఉంది. ఎమోషనల్ లైన్లతో ఆకట్టుకునేలా ఈ పాట ఉంది.
Salaar First Single: సలార్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఎమోషనల్ ఫ్రెండ్‍షిప్ సాంగ్ నేడు (డిసెంబర్ 13) రిలీజ్ అయింది. సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్‍గా విడుదల కానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా ఈ హైవోల్టేజ్ యాక్షన్ చిత్రంపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లింది. నేడు రిలీజైన ఈ తొలి సాంగ్ కూడా ఎమోషనల్‍గా మూవీ థీమ్‍ను తెలిపేలా ఉంది.
సలార్ నుంచి ‘సూరీడే’ అంటూ ఈ సాంగ్ వచ్చింది. సలార్ మూవీలో దేవ (ప్రభాస్), వరదరాజ్ మన్నార్ (పృథ్వి రాజ్‍సుకుమారన్) మధ్య స్నేహాన్ని తెలిపేలా ఈ పాట ఉంది. దేవ, వరదరాజ్ చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితులుగా ఈ పాటలో తెలుస్తోంది. హృదయాన్ని బరువెక్కించేలా ఎమోషనల్ ట్యూన్‍ను ఈ పాటకు అందించారు మ్యూజిక్ డైరెక్టర్ రవిబస్రూర్.
సూరీడే సాంగ్‍ను హరిణి వైటూరి పాడారు. కృష్ణ కాంత్ రిలిక్స్ అందించారు. స్నేహాన్ని వర్ణిస్తూ ఉన్న లైన్స్ ఈ పాటలో ఆకట్టుకుంటున్నాయి. సూరీడే సాంగ్‍ను హరిణి వైటూరి పాడారు. కృష్ణ కాంత్ రిలిక్స్ అందించారు. స్నేహాన్ని వర్ణిస్తూ ఉన్న లైన్స్ ఈ పాటలో ఆకట్టుకుంటున్నాయి. “సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి.. చిమ్మచీకటిలోనూ నీడలా ఉండేటోడు.. రెప్పనొదలక కాపుకాసేడి కన్నువాడు” అంటూ స్నేహానికి చిహ్నంలా ఉన్న రిలిక్స్‌తో ఈ పాట ప్రారంభమైంది. పాట మొత్తం ఓ ఎమోషనల్ మూడ్‍లోనే సాగింది. లిరికల్ వీడియోలోని కొన్ని సీన్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.
సలార్ నుంచి ఫస్ట్ సాంగ్ హిందీ (సూరజ్ హీ), తమిళం (ఆగాసా సూరియన్), కన్నడ (ఆకాశ గడియ), మలయాళం (సూర్యంగం)లోనూ రిలీజ్ అయింది. ఆయా భాషలకు సింగర్లు, రిలిక్ రైటర్లు వేర్వేరుగా ఉన్నారు.
సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ వస్తోంది. సలార్ సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ దక్కింది. యాక్షన్ సీన్లలో వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉండటంతో ఏ రేటింగ్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సుమారు 2 గంటల 55 నిమిషాల పాటు ఈ మూవీ రన్ టైమ్ ఉండనుంది.
సలార్ చిత్రం డిసెంబర్ 22న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆలోగానే ఈ మూవీ నుంచి ఫుల్ యాక్షన్‍తో మరో ట్రైలర్ కూడా వస్తుందనే అంచనాలు ఉన్నాయి. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.