OTT Telugu Releases: ఈ వారం ఓటీటీల్లోకి 4 తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..-sabari to goree puranama ott telugu movies releases this week on aha etv win and more ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Releases: ఈ వారం ఓటీటీల్లోకి 4 తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Telugu Releases: ఈ వారం ఓటీటీల్లోకి 4 తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 08, 2024 03:15 PM IST

OTT Telugu Movie Releases: ఈ వారం ఓటీటీల్లోకి నాలుగు తెలుగు సినిమాలు అడుగుపెడుతున్నాయి. ఓ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. సుహాస్ గొర్రె పురాణం చిత్రం కూడా ఇదే వారం ఓటీటీలోకి వస్తోంది.

OTT Telugu Releases: ఈ వారం ఓటీటీల్లోకి 4 తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Telugu Releases: ఈ వారం ఓటీటీల్లోకి 4 తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

ఓటీటీల్లోకి ఈవారం (అక్టోబర్ రెండో వారం) నాలుగు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. దసరా పండుగ ఉండటంతో సెలవులు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. వీకెండ్‍కు ఓటీటీల్లో కొత్త కంటెంట్ చూడాలనుకునే వారికి నాలుగు తెలుగు చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఓ మూవీ చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతుండగా.. సుహాస్ మూవీ ఒకటి స్ట్రీమింగ్‍కు రానుంది. ఇలా ఈవారంలో ఓటీటీల్లోకి రానున్న నాలుగు తెలుగు సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

గొర్రె పురాణం

సుహాస్ హీరోగా నటించిన గొర్రె పురాణం సినిమా థియేటర్లలో రిలిజైన 20 రోజులకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ చిత్రం ఈ గురువారం (అక్టోబర్ 10) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. గొర్రె వల్ల హిందువులు, ముస్లింల మధ్య గొడవలు ఎందుకు జరిగాయి, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. బాబీ దర్శకత్వం వహించిన గొర్రె పురాణం సెప్టెంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు అక్టోబర్ 10న ఆహా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

పైలం పిలగా

తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన లవ్ కామెడీ మూవీ ‘పైలం పిలగా’ అక్టోబర్ 10వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో సాయితేజ, పావని కరణం ప్రధాన పాత్రలు పోషించగా.. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 20వ తేదీన థియేటర్లలో పైలం పిలగా విడుదలైంది. 20 రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. అక్టోబర్ 10 నుంచి పైలం పిలగా మూవీని ఈటీవీ విన్‍లో చూసేయవచ్చు.

శబరి

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘శబరి’ చాలాకాలం నిరీక్షణ తర్వాత ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి సినిమా అక్టోబర్ 11వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తెలుగు మూవీ హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తోంది. అనిల్ కట్జ్ దర్శకత్వం వహించిన శబరి మూవీ ఈ ఏడాది మే 3న థియేటర్లలో రిలీజైంది.

తత్వ

క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తత్వ’ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. అక్టోబర్ 10వ తేదీన ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. హిమ దాసరి లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు రుత్విక్ యలగిరి దర్శకత్వం వహించారు. ఉస్మాన్ ఘని, పూజా రెడ్డి కూడా కీరోల్స్ చేశారు. ఈ సినిమా రన్‍టైమ్ సుమారు గంట మాత్రమే ఉండనుంది. అక్టోబర్ 10 నుంచి ఈటీవీ విన్‍లో తత్వ చిత్రాన్ని చూడొచ్చు.

‘మత్తువదలరా 2’ వస్తుందా?

శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రలు పోషించిన బ్లాక్‍బస్టర్ మూవీ ‘మత్తువదలరా 2’ చిత్రం ఈవారమే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటూ రూమర్లు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంకా ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. రితేశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం మంచి విజయం సాధించింది. మరి మత్తువదలరా 2 మూవీ ఈవారమే ఓటీటీలోకి వస్తుందా.. ఆలస్యమవుతుందా అనేది చూడాలి.

Whats_app_banner