Rashmika Mandanna: నీకు ఎవడు చెప్పాడు రా: అభిమానికి క్లాస్ పీకిన రష్మిక మందన్నా.. ఎందుకో తెలుసా?-rashmika mandanna not happy with a fan schools him on social media tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: నీకు ఎవడు చెప్పాడు రా: అభిమానికి క్లాస్ పీకిన రష్మిక మందన్నా.. ఎందుకో తెలుసా?

Rashmika Mandanna: నీకు ఎవడు చెప్పాడు రా: అభిమానికి క్లాస్ పీకిన రష్మిక మందన్నా.. ఎందుకో తెలుసా?

Hari Prasad S HT Telugu

Rashmika Mandanna: ఓ అభిమానిపై రష్మిక మందన్నా తీవ్రంగా మండిపడింది. నీకు ఎవడు చెప్పాడు రా అంటూ సోషల్ మీడియా ఎక్స్ లో ఆమె అనడం ఇప్పుడు వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో అభిమానికి క్లాస్ పీకిన రష్మిక మందన్నా (Instagram)

Rashmika Mandanna: టాలీవుడ్ నటి రష్మిక మందన్నా ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తనకు ఆడవాళ్లూ మీకు జోహార్లు స్క్రిప్ట్ నచ్చకపోయినా కేవలం శర్వానంద్ కోసం మూవీ చేసినట్లు తాను చెప్పానని వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. ఈ విషయం నీకు ఎవడు చెప్పాడంటూ సదరు అభిమానికి క్లాస్ పీకింది.

రష్మిక మందన్నా సీరియస్

రష్మిక మందన్నా ఈ మధ్య ట్విటర్ లో ఫ్యాన్స్ తో చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఈ ప్రశ్న అడిగాడు. "నాకు ఆడవాళ్లూ జోహార్లు స్క్రిప్ట్ నచ్చకపోయినా కేవలం కిశోర్ తిరుమల, శర్వానంద్ కోసమే చేశాను-రష్మిక మందన్నా" అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. దీనికి రష్మిక మూడీగా ఉన్న ఓ వీడియోను కూడా యాడ్ చేశాడు.

దీనిపై రష్మిక తీవ్రంగానే స్పందించింది. "నీకు ఎవడు చెప్పాడు రా. నేను స్క్రిప్ట్ ను నమ్మే సినిమాలు చేస్తాను. సినిమాలో నటీనటులు, ఇతర సిబ్బందితో పని చేయడం ఓ గౌరవం. ఇలాంటి ఆధారాలు లేని వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావడం లేదు" అని రష్మిక కాస్తా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. శర్వానంద్ తో కలిసి రష్మిక ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే మూవీలో నటించింది.

ఈ సినిమా 2022లో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత రష్మిక ఇలాంటి కామెంట్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మీరు నిజంగానే ఈ మాట అన్నారా అంటూ సదరు అభిమాని రష్మికను ప్రశ్నించాడు. దీనికి ఆమె ఇలా తీవ్రంగా స్పందించింది.

రష్మిక రాబోయే సినిమాలు

రష్మిక మందన్నా ప్రస్తుతం యానిమల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. రణ్‌బీర్ కపూర్ తో కలిసి ఆమె నటించిన యానిమల్ గతేడాది డిసెంబర్ 1న రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ఈ మూవీ జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఆ ఓటీటీలోనూ యానిమల్ దూసుకెళ్తోంది.

ఇప్పటి వరకూ ఏ ఇండియన్ మూవీకీ సాధ్యం కాని రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 మూవీలో నటిస్తోంది. ఇదే కాకుండా రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి తెలుగు సినిమాలతోపాటు చావా అనే హిందీ మూవీలోనే నటిస్తోంది. వీటిలో పుష్ప ది రూల్ మూవీ ఆగస్ట్ 15న రాబోతోంది. ఇందులో రష్మిక మరోసారి శ్రీవల్లీ పాత్రలో కనిపించనుంది.

ఇక యానిమల్ మూవీ సక్సెస్ తర్వాత రష్మిక మందన్నా తన రెమ్యునరేషన్ ను రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్లకు పెంచినట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపైనా ఆమె స్పందించింది. ఇదేదో బాగానే ఉంది.. నేనూ ఇలాగే చేయాలనుకుంటున్నాను.. ప్రొడ్యూసర్లు ఎందుకంత అని అడిగితే మీడియా పేరే చెబుతాను అంటూ రష్మిక అనడం గమనార్హం.