Animal Music Record: యానిమల్ సరికొత్త రికార్డ్.. అత్యంత వేగవంతమైన ఇండియన్ ఆల్బమ్‌గా ఘనత-animal movie music album has 500 million streams on spotify animal creates fastest indian album record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Animal Movie Music Album Has 500 Million Streams On Spotify Animal Creates Fastest Indian Album Record

Animal Music Record: యానిమల్ సరికొత్త రికార్డ్.. అత్యంత వేగవంతమైన ఇండియన్ ఆల్బమ్‌గా ఘనత

Sanjiv Kumar HT Telugu
Feb 12, 2024 10:47 AM IST

Animal Movie Music Album Record In Spotify: అనేక వివాదాలు ఎదుర్కొన్న యానిమల్ మూవీ మరోసారి కొత్త రికార్డుతో సత్తా చాటింది. ఇప్పటికే ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌ మూవీగా రికార్డ్ కొట్టిన యానిమల్ చిత్రం తాజాగా మరో సరికొత్త ఘనత సాధించింది.

యానిమల్ సరికొత్త రికార్డ్.. అత్యంత వేగవంతమైన ఇండియన్ ఆల్బమ్‌గా ఘనత
యానిమల్ సరికొత్త రికార్డ్.. అత్యంత వేగవంతమైన ఇండియన్ ఆల్బమ్‌గా ఘనత

Animal Movie Record In Spotify: అర్జున్ రెడ్డి మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటించిన యానిమల్ సినిమాలో అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యానిమల్ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళీ పిక్చర్స్ సినీ 1 స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

యానిమల్ చిత్రానికి భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ కేతానీ, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమాలోని పాటలు, బీజీఎమ్, సీన్స్, స్క్రీన్ ప్లేకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో యానిమల్ సినిమాకు సంబంధించిన సీన్స్, బీజీఎమ్స్‌తో సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనం ఇచ్చాయి. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తంగా రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో యానిమల్ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఓటీటీలో యానిమల్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్‌తోపాటు విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఓటీటీలో యానిమల్ మూవీ చూసిన స్టార్ సెలబ్రిటీలు విరుచుకుపడుతూ విమర్శించారు. యానిమల్ మూవీపై ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, కంగనా రనౌత్, సీరియల్ నటి కస్తూరి శంకర్, హీరోయిన్ రాధిక తదితరులు విమర్శిస్తూ ట్వీట్స్ పెట్టారు.

విమర్శల సంగతి ఎలా ఉన్న యానిమల్ మూవీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీలో ఒకటిగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షణలు పొందిన ఇండియన్ మూవీగా యానిమల్ రికార్డ్ క్రియేట్ చేసింది. గ్లోబల్ చార్ట్‌లో రెండు వారాల పాటు వరుసగా ఎక్కువగా స్ట్రీమింగ్ అయిన నాన్ ఇంగ్లీష్ చిత్రంగా యానిమల్ అరుదైన ఘనత సాధించింది. ఇప్పుడు మరో రికార్డ్ కొల్లగొట్టింది యానిమల్ మూవీ.

ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్పాటిఫై (Spotify)లో 500 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్‌గా యానిమల్ న్యూ రికార్డ్ నెలకొల్పింది. అత్యంత వేగంగా 5000 మిలియన్లకు (సుమారు 50 కోట్ల స్ట్రీమ్స్) పైగా స్ట్రీమ్‌లను ప్లే చేసిన ఇండియన్ ఆల్బమ్‌గా ఘనత సాధించింది. అంతేకాకుండా యానిమల్ మ్యూజిక్ ఆల్బమ్ డీలక్స్ ఎడిషన్‌ కెటగిరీలోకి చేరింది. కాగా యానిమల్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే.

యానిమల్ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిస్తే బీజీఎమ్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కొన్ని సీన్లను ఎలివేట్ చేయడంలో బీజీఎమ్ హైలెట్‌గా నిలిచాయి. ఇక అమ్మాయి, ఏమో ఏం చేస్తున్నానో, జమాల్ కుడు, నాన్నా, యాలో యాలా పాటలు తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే యానిమల్ మూవీకి ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, హర్షవర్ధన్ రామేశ్వర్, అజయ్-అతుల్, శ్రేయాస్ పురానిక్, ఆశిమ్ కెమ్సన్ సంగీతం అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

IPL_Entry_Point