Double Ismart Update: రామ్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ కంప్లీట్ - రిలీజ్ డేట్‌పై మరోసారి పూరి క్లారిటీ!
Double Ismart Update: రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ షూటింగ్‌పై డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించాడు. రిలీజ్ డేట్‌పై మరోమారు క్లారిటీ ఇచ్చారు.
Double Ismart Update: రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సీక్వెల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. ఈ రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆగస్ట్ 15నే డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించారు. రిలీజ్ డేట్‌లో ఎలాంటి ఛేంజ్ లేదని అన్నారు.
ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్...
రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ మూవీ రూపొందుతోంది. డబుల్ ఇస్మార్ట్ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తోన్నాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మితో కలిసి స్వయంగా పూరి జగన్నాథ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
మార్చిలో రిలీజ్ కావాల్సింది...కానీ...
గత ఏడాది జూలైలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సరిగ్గా ఏడాదికి ఈ సినిమాను పూర్తిచేశాడు పూరి జగన్నాథ్. పాటలు, టాకీపార్ట్‌తో పాటు మొత్తం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతోన్నట్లు పేర్కొన్నారు. మార్చి 8... 2024న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఓపెనింగ్ రోజు పూరి జగన్నాథ్ వెల్లడించాడు. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా చాలా రోజులు పాటు నిలిచిపోయింది. దాంతో మార్చి 8న రిలీజ్ కావాల్సిన సినిమా ఆగస్ట్ 15కు వాయిదాపడింది.
పాన్ ఇండియన్ లెవెల్‌లో...
ఆగస్ట్ 15న కూడా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కావడం కష్టమేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై శుక్రవారం పూరి జగన్నాథ్ అండ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అదే రోజు పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది.
ప్రాఫిట్స్ షేర్ బేసిస్...
డబుల్ ఇస్మార్ట్ మూవీని రెమ్యునరేషన్ లేకుండా హీరో రామ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రాఫిట్స్ షేర్ బేసిస్ (సినిమాకు వచ్చిన లాభాల్లో వాటా) విధానంలో సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతోన్నారు.
ఇద్దరికి కీలకం...
డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ అటు రామ్‌తో పాటు ఇటు పూరి జగన్నాథ్ కెరీర్‌కు కీలకంగా మారింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన స్కంద కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. మరోవైపు విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ చేసిన లైగర్ మూవీ డిజాస్టర్ అయ్యింది. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కన లైగర్ మూవీ యాభై కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. దర్శకుడిగా లైగర్ సినిమాతో విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా నిర్మాతగా పూరి జగన్నాథ్ తీవ్రంగా నష్టపోయారు. డబుల్ ఇస్మార్ట్‌తో తనపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోన్నారు.
సంజయ్ దత్ రెమ్యునరేషన్...
డబుల్ ఇస్మార్ట్ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీక్వెల్ కోసం సంజయ్‌దత్ 15 కోట్లకుపైనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. డబుల్ ఇస్మార్ట్‌లో సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
రామ్ రెండు సినిమాలు...
డబుల్ ఇస్మార్ట్ తర్వాత హీరో రామ్ తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబుతో రామ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. కమర్షియల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రామ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మరో మూవీ రానున్నట్లు చెబుతోన్నారు. మరోవైపు లైగర్ తర్వాత విజయ్ దేవరకొండతో జనగనమణ సినిమాను అనౌన్స్ చేశాడు పూరి జగన్నాథ్. కానీ లైగర్ డిజాస్టర్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లోనే ఈ సినిమా ఆగిపోయింది.