Vijay Deverakonda: ఫ్యామిలీస్టార్ డిజాస్టర్...అయినా విజయ్ దేవరకొండతో దిల్‌రాజు మరో మూవీ - ఈ సారి మాస్ కథ
Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండతో మరో మూవీ చేయబోతున్నాడు నిర్మాత దిల్‌రాజు. శనివారం ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. గీతగోవిందం తర్వాత విజయ్, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన ఈ మూవీపై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. ఫ్యామిలీ కథల పట్ల ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు ఉన్న జడ్జిమెంట్ కూడా ఈ మూవీపై బజ్ పెరగడానికి ఓ కారణమైంది.
ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని ఈ మూవీ గట్టెక్కిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆడియెన్స్ నుంచి ఊహించని రిజల్ట్ వచ్చింది. అవుట్‌డేటెడ్ స్టోరీలైన్, ఆర్టిఫీషియల్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకులు తిప్పికొట్టారు. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌లోనూ అంతంత మాత్రంగానే ఆదరణను సొంతం చేసుకున్నది.
నెక్స్ట్ మూవీ విజయ్‌తోనే..
ఫ్యామిలీ స్టార్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మరో భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించబోతున్నాడు దిల్‌రాజు ఈ సినిమాను శనివారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాల్ని విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మే 9న అనౌన్స్‌చేయబోతున్నట్లు ప్రకటించారు. మే 9న ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం.
రాజావారు రాణిగారు డైరెక్టర్...
రాజావారు రాణిగారు మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రవికిరణ్ కోలా. దర్శకుడిగా ఇది అతడికి సెకండ్ మూవీ. విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం మూవీకి రైటర్‌గా రవికిరణ్ కోలా వ్యవహరించాడు.
రౌడీ జనార్ధన్...
విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా మూవీ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ దేవరకొండ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. గత సినిమాలకు పూర్తి భిన్నంగా విజయ్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. ఈ రూరల్ యాక్షన్ డ్రామా సినిమాకు రౌడీ జనార్ధన్ అనే పేరును పరిశీలిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తోన్న 59వ మూవీ ఇది.
స్పై యాక్షన్ మూవీ…
ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నాడు. స్పై యాక్షన్ తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. విజయ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
టాక్సీవాలా తర్వాత…
టాక్సీవాలా తర్వాత విజయ్‌కి సరైన సక్సెస్ లేదు. డియర్ కామ్రేడ్, నోటా, లైగర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఖుషి, ఫ్యామిలీస్టార్ కూడా ఆ జాబితాలోనే చేరాయి. దాంతో గౌతమ్ తిన్ననూరి మూవీపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నాడు.
20 కోట్ల కలెక్షన్స్…
దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ మూవీ 20 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో అతి తక్కువ కలెక్షన్స్ దక్కించుకున్న మూవీగా చెత్త రికార్డును మూట గట్టుకుంది.