Puri Jagannadh: శివ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా పూరి జగన్నాథ్ - ఫొటో వైరల్
Puri Jagannadh: రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాలో పూరి జగన్నాథ్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా ఓ చిన్న పాత్రను పోషించాడు. పూరి జగన్నాథ్ ఫొటోను వర్మ గురువారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
Puri Jagannadh హీరోయిజం, మాస్ అనే పదాలకు టాలీవుడ్‌లో కొత్త ఆర్థాన్ని సృష్టించిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. హీరోలను మాస్ యాంగిల్‌లో పవర్‌ఫుల్‌గా తన సినిమాల్లో ఆవిష్కరిస్తుంటారు పూరి జగన్నాథ్. మహేష్‌బాబు, ప్రభాస్, రామ్‌తో పాటు ఎంతో మంది హీరోలకు తన సినిమాలతో మాస్ ఇమేజ్‌ను తీసుకొచ్చాడు పూరి జగన్నాథ్. పూరి సినీ ప్రయాణం రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడిగా మొదలైంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
వర్మ స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాడు పూరి జగన్నాథ్. వర్మ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ శివ లోపూరి జగన్నాథ్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. విలన్ రఘువరన్ బ్యాచ్‌లో ఒకడిగా ఓ చిన్న పాత్రను పోషించాడు.
కొద్ది క్షణాలు అలా స్క్రీన్‌పై కనిపించి వెళ్లిపోయే పాత్ర అది. శివ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా పూరి జగన్నాథ్ కనిపించిన ఫొటోను వర్మ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. స్ఫూర్తివంతమైన ఎదుగుదలకు అసలైన నిదర్శనంగా పూరి జగన్నాథ్ నిలిచాడని వర్మ పేర్కొన్నాడు.
రామ్‌గోపాల్ వర్మ షేర్ చేసిన పూరి జగన్నాథ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లైగర్ సినిమాతో డిజాస్టర్‌ను ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ సినిమాను చేస్తోన్నాడు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
బుధవారం నుంచి హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాను ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తోన్నాడు. డబుల్ ఇస్మార్ట్ 2024 మార్చి 8న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.