Raa Macha Macha: 1000కిపైగా జానపద కళాకారులతో రామ్ చరణ్ డ్యాన్స్.. గేమ్ చేంజర్ రా మచ్చా సాంగ్ ప్రత్యేకతలు ఎన్నో!-ram charan dance with 1000 folk artist in raa macha macha song specialties from game changer movie directed by shankar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raa Macha Macha: 1000కిపైగా జానపద కళాకారులతో రామ్ చరణ్ డ్యాన్స్.. గేమ్ చేంజర్ రా మచ్చా సాంగ్ ప్రత్యేకతలు ఎన్నో!

Raa Macha Macha: 1000కిపైగా జానపద కళాకారులతో రామ్ చరణ్ డ్యాన్స్.. గేమ్ చేంజర్ రా మచ్చా సాంగ్ ప్రత్యేకతలు ఎన్నో!

Sanjiv Kumar HT Telugu
Oct 01, 2024 10:55 AM IST

Game Changer Raa Macha Macha Song Specialities: దాదాపుగా వెయ్యి మందికిపైగా జానపదా కళాకారులతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ చేయడం ప్రస్తుతం విశేషంగా మారింది. గేమ్ చేంజర్ సినిమాలో సెప్టెంబర్ 30న రిలీజైన రా మచ్చా మచ్చా పాటలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే..

1000కిపైగా జానపద కళాకారులతో రామ్ చరణ్ డ్యాన్స్.. గేమ్ చేంజర్ రా మచ్చా సాంగ్ ప్రత్యేకతలు ఎన్నో!
1000కిపైగా జానపద కళాకారులతో రామ్ చరణ్ డ్యాన్స్.. గేమ్ చేంజర్ రా మచ్చా సాంగ్ ప్రత్యేకతలు ఎన్నో!

Ram Charan Dance With 1000 Folk Artist: మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినీ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ పాట సోమవారం (సెప్టెంబర్ 30) రిలీజైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఈ ‘గేమ్ చేంజర్’.

శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

హిందీలో అలా

అయితే, అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన గేమ్ చేంజర్ సెకండ్ లిరికల్ సాంగ్ రా మచ్చా మచ్చా సాంగ్‌ను తెలుగు, తమిళంలో విడుదల చేశారు. అలాగే, ‘ధమ్ తు దికాజా..’ అంటూ హిందీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే, ఈ రా మచ్చా మచ్చా సాంగ్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

రామ్ చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌గా తెర‌కెక్కిన ఈ పాటను శంక‌ర్ త‌న‌దైన మార్క్ చూపిస్తూ గ్రాండియ‌ర్‌గా తెర‌కెక్కించారు. రామ్ చ‌ర‌ణ్‌ ఎన‌ర్జిటిక్‌, స్టైలిష్ లుక్‌లో అల‌రించారు. ఇక గ్రేస్‌తో ఆయ‌న వేసిన హుక్ స్టెప్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. ఈ పాట‌లో ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు ఈ పాట‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేయటం విశేషం.

అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు ఇందులో భాగ‌మ‌వ‌టం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంస్కృతుల‌ను బేస్ చేసుకుని ఈ పాట‌ను శంక‌ర్ వినూత్నంగా తెర‌కెక్కించారు.

విభిన్న నృత్య రీతులు

ఏపీలో గుసాడి, కొమ్ము కోయ‌, త‌ప్పెట గుళ్లు వంటి జాన‌ప‌ద నృత్యాల‌తో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రాన‌ప్ప‌, పైకా, దురువ వంటి వాటితో పాటు క‌ర్ణాట‌కు చెందిన హ‌లారి, ఒక్క‌లిగ‌, గొర‌వ‌ర‌, కుణిత వంటి నృత్య రీతుల‌ను కూడా ఈ సాంగ్‌లో మమేకం చేశారు శంక‌ర్‌.

గ‌ణేష్ ఆచార్య మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో ఈ పాట రూపుదిద్దుకుంది. తెలుగు, తమిళం, హిందీలో న‌కాష్ అజీజ్ పాడిన ఈ పాటను తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కుమార్ రాశారు.

ఇదిలా ఉంటే, రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఇయ‌ర్ ఎండింగ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ టు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ గేమ్ ఛేంజ‌ర్ రెడీ అంటోంది.

ఫ్యాన్సీ రేట్‌కు

లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను అబ్బుర‌ప‌రిచే రీతిలో తెర‌కెక్కించే శంకర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను రూపొందించినట్లు మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తుండ‌గా తిరుణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.