Ram Charan Rc15 Shooting Update: ఆర్‌సీ 15 సినిమాకు కొరియోగ్ర‌ఫీ అందిస్తోన్న నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ -ram charan shankar movie song shoot begins in new zealand ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Rc15 Shooting Update: ఆర్‌సీ 15 సినిమాకు కొరియోగ్ర‌ఫీ అందిస్తోన్న నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్

Ram Charan Rc15 Shooting Update: ఆర్‌సీ 15 సినిమాకు కొరియోగ్ర‌ఫీ అందిస్తోన్న నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్

Ram Charan Rc15 Shooting Update: రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌లో జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వాణీపై రొమాంటిక్ డ్యూయెట్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట‌కు నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నాడు.

రామ్‌చ‌ర‌ణ్‌.

Ram Charan Rc15 Shooting Update: ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్‌ శంక‌ర్‌తో ఓ సినిమా చేస్తోన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో పాన్ ఇండియ‌న్ స్థాయిలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. బుధ‌వారం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జ‌రుగుతోంది.

రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వాణీల‌పై పాట‌ను చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌. న్యూజిలాండ్‌లోని డ్యూన్‌డిన్‌తో బీచ్‌, ఒటాగో హార్బ‌ర్ తో పాటు స‌ముద్ర తీర ప్రాంతాల్లో ఈ రొమాంటిక్ డ్యూయెట్‌ను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ పాట‌కు బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్‌, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ బాస్కో మార్టిస్ డ్యాన్స్ కంపోజ్ చేస్తోన్నాడు. గ‌తంలో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ధృవ సినిమాలోని నీతోనే పాట‌కు బాస్కో మార్టిస్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు.

ధృవ త‌ర్వాత మ‌రోసారి చ‌ర‌ణ్ సినిమాకు అత‌డు కొరియోగ్రాఫీ అందిస్తున్నాడు. ప‌ది రోజుల పాటు ఈ పాట‌ను న్యూజిలాండ్‌లోనే చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ పాట షూటింగ్ త‌ర్వాత రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చి డిసెంబ‌ర్ నెలాఖ‌రున నెక్స్ట్ షెడ్యూల్‌ను ఏపీలో మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ షెడ్యూల్‌లో రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ సినిమాలో అవినీతిపై పోరాడే ఐఏఎస్ అధికారిగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విన‌య‌విధేయ రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వాణీ మ‌రోసారి జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇదే. త‌మిళ న‌టుడు ఎస్‌జే సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. సునీల్‌, న‌వీన్‌చంద్ర‌, అంజ‌లి కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు.