Dil Raju: ప్రతి ఇంట్లో ఉండేదే అది.. గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు కామెంట్స్ వైరల్
Producer Dil Raju About Janaka Aithe Ganaka Movie: రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు జనక అయితే గనక సినిమా ట్రైలర్ లాంచ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రతి ఇంట్లో ఉండేదే అది అంటూ దిల్ రాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Producer Dil Raju Comments: వెర్సటైల్ యాక్టర్ సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా సంగీర్తన నటించింది. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు.
సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల 'జనక అయితే గనక' మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బలగం వంటి సెన్సేషన్ బ్లాక్ బస్టర్ సాధించిన దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో వస్తోన్న సినిమా ఇది. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
బలగం మూవీకి ఉన్నట్లే
అయితే, బలగం సినిమా కంటెంట్‌పై దిల్ రాజు ఎంత నమ్మకంగా ఉన్నారో.. అంతే నమ్మకంతో ‘జనక అయితే గనక’ సినిమాపై నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, నా ఫేవరేట్ నా పెళ్లాం సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల జనక అయితే గనక ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనక అయితే గనక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు మాట్లాడుతూ "మధ్య తరగతి తండ్రికి ఉండే కష్టాలను అందరం చూసే ఉంటాం. ప్రతీ ఇంట్లో ఉండేదే అది. డైరెక్టర్ సందీప్ తన రియల్ లైఫ్‌లో చూసిన ఇన్సిడెన్స్‌ను బేస్ చేసుకుని కథను తయారు చేశారు. దీన్ని హ్యుమరస్‌గా, మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేశారు" అని అన్నారు.
"జనక అయితే గనక సినిమా చూశాను. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమాను మీరు చూడబోతున్నారనే నమ్మకంతో ఉన్నాం. సెప్టెంబర్ 7న సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. కావాల్సినంత హ్యుమర్ ఉంటుంది. నాన్ స్టాప్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. సుహాస్, సంగీర్తన జంట ఆన్ స్క్రీన్ చక్కగా ఉంటుంది. సెప్టెంబర్ 7న జనక అయితే గనక సినిమాతో మీ అందరి ముందుకొస్తున్నాం" అని దిల్ రాజు తెలిపారు.
వాయిదా పడట్లేదు
కాగా ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో గేమ్ చేంజర్ సినిమా వాయిదా పడట్లేదని ఇటీవల దిల్ రాజు చెప్పారు. సినిమాలో ఐదు పాటలు విజువల్ ట్రీట్‌లా ఉంటాయని, గేమ్ చేంజర్‌తో ఇదివరకు డైరెక్టర్ శంకర్‌ను చూస్తారని దిల్ రాజు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, జనక అయితే గనక ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. జనక అయితే గనక ట్రైలర్‌లోకి వెళితే.. సుహాస్‌కు పెళ్లైనప్పటికీ పిల్లలు వద్దని అనుకుంటూ ఉంటాడు. అందుకు కారణం.. ఖర్చులు పెరిగిపోతాయని అతని భయం. భార్యకు ఏం చెప్పి మ్యానేజ్ చేస్తున్నాడనేది ఎవరికీ అర్థం కాదు.
గర్భవతి అని తెలిసినప్పుడు
అతని కుటుంబ సభ్యులందరూ పిల్లలు కనమని ఎంత బలవంతం చేసినా అందరికీ సర్ది చెప్పేస్తుంటాడనే విషయాలను కామెడీ సన్నివేశాలతో చూపించారు. ఇలాంటి మనస్తత్వమున్న హీరోకి తన భార్య గర్భవతి అని తెలిసినప్పుడు ఏం చేస్తాడు.. మధ్య తరగతి వ్యక్తి అయిన హీరో ఎవరిపై కేసు వేస్తాడు.. అసలు కేసు ఎందుకు వేస్తాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.