OTT: ఓటీటీలో సడెన్‍గా మాయమైన రక్షిత్ శెట్టి ఎమోషనల్ మూవీ.. ఎందుకిలా!
Sapta Sagaradaache Ello Side B OTT: సప్తసాగర దాచె ఎల్లో సైడ్-బీ సినిమా హఠాత్తుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మాయమైంది. అందుబాటులో లేకుండా పోయింది. సైడ్ ఏ.. ఉన్నా సైడ్-బీ మాత్రం మిస్ అయింది.
OTT: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచె ఎల్లో (తెలుగులో సప్త సాగరాలు దాటి) సైడ్-ఏ, సైడ్-బీ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాలు.. తెలుగులోనూ మంచి కలెక్షన్లను దక్కించుకున్నాయి. గతేడాది నెలల వ్యవధిలో థియేటర్లలో రిలీజైన ఈ లవ్ ఎమోషనల్ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ రెండు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. అయితే, సప్త సాగరదాచె ఎల్లో సైడ్-బీ సినిమా సడెన్‍గా ఓటీటీలో మాయమైంది.
సైడ్-బీ మిస్
సప్త సాగరదాచె ఎల్లో సైడ్-బీ సినిమా జనవరి 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలలకు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. చాలా ఆలస్యంగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఇప్పుడు తాజాగా ఈ సైడ్-బీ సినిమా ఆ ఓటీటీలో మాయమైంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రస్తుతం సప్త సాగరదాచె సైడ్-ఏ సినిమా అందుబాటులో ఉన్నా.. సడెన్‍గా సైడ్-బీ మిస్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో కొందరు యూజర్లు పోస్టులు చేస్తున్నారు. సైడ్-బీ సినిమా ఎందుకు మిస్ అయిందని ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రైమ్ వీడియో ఈ విషయంపై ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
కారణమిదేనా?
సప్త సాగరదాచె ఎల్లో చిత్రాలకు హీరో రక్షిత్ శెట్టి నిర్మాతగానూ ఉన్నారు. సైడ్-ఏ, సైడ్-బీ చిత్రాల శాటిలైట్ హక్కులను జీ నెట్‍వర్క్ సొంతం చేసుకుంది. అయితే, సైడ్-బీ చిత్రాన్ని ‘జీ5’ ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందుకే.. సైడ్-బీ మూవీ ప్రైమ్ వీడియోలో మిస్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైడ్-ఏ మాత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులోనే ఉంది.
సప్తసాగర దాచె ఎల్లో చిత్రానికి ముందుగా నిర్మాతగా పుష్కర్ వ్యవహరించారు. అయితే, ఆ తర్వాత రక్షిత్ తీసుకున్నారు. అయితే, తొలుత ఇది ఒక మూవీగానే ఉంటుందనుకొని అమెజాన్ ప్రైమ్ వీడియోకు స్ట్రీమింగ్ హక్కులను విక్రయించారు పుష్కర్. ఈ డీల్ ప్రకారం సైడ్-ఏ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సైడ్-బీ విషయంలో ఓటీటీ విషయంలో రక్షిత్ నిర్ణయం తీసుకున్నారు. సైడ్-బీ ఓటీటీ హక్కులను కూడా ప్రైమ్ వీడియోకే రక్షిత్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు సైడ్-బీ సడెన్‍గా మిస్ అవడంతో కొన్నాళ్లకే డీల్ చేసుకున్నారా అనే సందేహం వ్యక్తమవుతోంది.
సప్తసాగర దాచె ఎల్లో సినిమాల్లో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. సైడ్-ఏకు కొనసాగింపుగానే సైడ్-బీ మూవీ వచ్చింది. ఈ చిత్రాలకు హేమంత్ ఎం.రావ్ దర్శకత్వం వహించారు. ఇంటెన్స్ లవ్ ఎమోషనల్‍గా ఈ చిత్రాలను తెరకెక్కించారు. రక్షిత్, రుక్మిణి యాక్టింగ్ ఈ సినిమాలకు హైలైట్‍గా నిలిచాయి. ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ ఈ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాలకు పెద్ద ప్లస్ అయింది.