Rajinikanth: ట్విస్ట్ తీసేశారు.. సీన్లు మార్చేశారు.. రజినీకాంత్ వల్లే ఆ మూవీ అలా..: స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు
KS Ravikumar on Rajinikanth: రజినీకాంత్‍పై డైరెక్టర్ కేఎస్ రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. లింగ సినిమా పరాజయానికి రజినీనే కారణం అనేలా మాట్లాడారు. చాలా కామెంట్లు విషయాలు వెల్లడించారు.
తమిళ స్టార్ హీరో తలైవా రజినీకాంత్ కెరీర్‌లో ‘లింగ’ ఓ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. 2014లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను దక్కించుకోలేదు. ఈ మూవీకి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. రూ.100 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు, లింగ సినిమా వైఫల్యంపై దర్శకుడు రవికుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం ప్లాఫ్ అయ్యేందుకు రజినీకాంతే కారణం అనేలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు.
టైమ్ ఇవ్వలేదు.. సెకండ్ హాఫ్ మార్చేశారు
లింగ సినిమా గురించి చాట్ విత్ చిత్రా ఇంటర్వ్యూలో డైరెక్టర్ కేఎస్ రవికుమార్ మాట్లాడారు. లింగ సినిమా క్లైమాక్స్‌లో ట్విస్టును రజినీకాంత్ తీసేశారని రవికుమార్ చెప్పారు. సెకండాఫ్‍ను పూర్తిగా మార్చేశారని వెల్లడించారు. గ్రాఫిక్స్ కోసం సమయం కూడా ఇవ్వలేదని రవికుమార్ ఆరోపించారు.
లింగ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో రజినీకాంత్ ఎక్కువగా జోక్యం చేసుకున్నారని రవికుమార్ వెల్లడించారు. “రజినీకాంత్ ఎడిటింగ్‍లో చాలా జోక్యం చేసుకున్నారు. సీజీఐ కోసం నాకు టైమ్ ఇవ్వలేదు. ఈ మూవీ సెకండ్ హాఫ్‍ను పూర్తిగా మార్చేశారు. క్లైమాక్స్‌లో ఓ సర్‌ప్రైజ్ ట్విస్టును తీసేశారు. అనుష్క ఉన్న ఓ పాటను కూడా తీసేశారు” అని రవికుమార్ ఆరోపించారు.
బెలూన్ షాట్ ఐడియా రజినీదే
లింగ చిత్రంలో ఓ ఫైట్‍లో బ్రిడ్జి మీద నుంచి హాట్ ఎయిర్ బెలూన్‍పైకి రజినీకాంత్ జంప్ చేస్తారు. ఈ సీన్‍పై ట్రోల్స్ బాగా వచ్చాయి. అయితే, ఆ బెలూన్ ఐడియా రజినీకాంత్‍దే అన్నట్టుగా రవికుమార్ వెల్లడించారు. ఆ సీన్ తన కెరీర్‌ను నాశనం చేసిందని అన్నారు. లింగ చిత్రాన్ని ఆ ఆర్టిఫిషియల్ బెలూన్ జంప్ సీన్ పూర్తిగా చెడగొట్టిందని అన్నారు.
లింగ చిత్రంలో రజినీకాంత్ డ్యుయల్ రోల్స్ చేశారు. లింగేశ్వరన్, రాజా లింగేశ్వరన్ అంటూ రెండో పాత్రల్లో కనిపించారు. అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు, కే విశ్వనాథ్, సంతానం, కరుణాకరన్, బ్రహ్మానందం, దేవ్ గిల్, రాధా రవి ఈ చిత్రంలో కీలకపాత్రలు చేశారు.
లింగ చిత్రాన్ని రాక్‍లైన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై వెంకటేశ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రంతో డైరెక్టర్ కేఎస్ రవికుమార్‌పై విమర్శలు వచ్చాయి. అయితే, మరీ డిజాస్టర్ కాకుండా దాదాపు సుమారు రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ఈ చిత్రం దక్కించుకోగలిగింది. తెలుగులోనూ ఈ మూవీకి పెద్దగా వసూళ్లు రాలేదు.
వెట్టయన్ రిలీజ్‍కు రెడీ
రజినీకాంత్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన వెట్టయన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారమే అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ యాక్టర్లు కూడా ఈ మూవీలో నటించారు. టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లోకేేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి చిత్రం కూడా రజినీకాంత్ చేస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.