Pushpa 2 Records: పుష్ప 2తో విజయ్ సినిమా మార్క్ దాటాలి: మలయాళ డిస్ట్రిబ్యూటర్.. కేజీఎఫ్ 2 ఓపెనింగ్స్ మించిపోయే ప్లాన్!
Distributors About Pushpa 2 Records By Surpass Leo KGF 2: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయగలదో అన్ని చేసేందుకు మలయాళం, కర్ణాటక సినీ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారు. దళపతి విజయ్ లియో మార్క్ దాటాలని అనుకుంటున్నట్లుగా మలయాళ డిస్ట్రిబ్యూటర్ చెప్పారు.
Distributors On Pushpa 2 Records: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప 2. బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్. బన్నీ సెన్సేషన్ కాంబోలో వస్తున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అలాగే, పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 రిలీజ్ డేట్
అయితే, అక్టోబర్ 24న పుష్ప 2 రిలీజ్ డేట్ మారినట్లుగా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అనుకున్న తేది (డిసెంబర్ 6) కంటే ఒకరోజు ముందుగా అంటే డిసెంబరు 5న పుష్ప ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రీమూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్‌తో నిర్మాణం జరుపుకున్న ఈ మూవీకి నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు.
ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూటర్స్
గురువారం (అక్టోబర్ 24) పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించడానికి హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్‌గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పుష్ప 2 మూవీని ఇండియా వైడ్‌గా పంపిణీ చేస్తున్న ఇతర సినీ ఇండస్ట్రీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాల్గొన్నారు.
లియో మార్క్ దాటేలా
ఈ సందర్భంగా మలయాళంకి సంబందించిన ఈ4 ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూటర్ ముకేశ్ మెహతా మాట్లాడుతూ.. "పుష్ప 2తో మేము రూ. 12 కోట్ల మార్క్‌ని టచ్ చేయాలని అనుకుంటున్నాం. దళపతి విజయ్ నటించిన లియో కలెక్ట్ చేసిన నంబర్ అది. అంతే కాకుండా, 24 గంటలు ఈ సినిమాకి సంబందించిన షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు.
పుష్ప 2తో క్రాస్ చేసేలా
అంటే, కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వచ్చిన లియో మూవీ కలెక్ట్ చేసిన రూ. 12 కోట్లను పుష్ప 2తో క్రాస్ చేయాలని భావిస్తున్నట్లు మలయాళ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. అలాగే, కర్ణాటకలో యశ్, ప్రశాంత్ నీల్ కాంబో బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 2ని కూడా దాటేలా కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
అత్యధిక బిజినెస్‌కు మించి
కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. "కర్ణాటకలో క్రేజీ బిజినెస్ చేస్తాం. కర్ణాటకలో ఒక సినిమా చేసిన అత్యధిక బిజినెస్ 90-95 కోట్ల రూపాయలు. కర్నాటకలో అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చూస్తాం. దాదాపు 500 స్క్రీన్లలో సినిమాను విడుదల చేసి నైట్ షోలు కూడా ప్లాన్ చేస్తాం" అని తెలిపారు.
30 కోట్లు అధిగమించేలా
"కేజీఎఫ్ 2 మూవీ 350 సింగిల్ స్క్రీన్లలో విడుదలైంది. పుష్ప 2 సినిమా 500 సింగిల్ స్క్రీన్లలో విడుదల కానుంది. కేజీఎఫ్ 2 ఓపెనింగ్ డే కలెక్షన్ దాదాపు రూ. 30 కోట్లు. మేము దానిని కచ్చితంగా అధిగమిస్తాము" అని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. అంటే స్క్రీన్లతోపాటు కలెక్షన్స్ పరంగా కర్ణాటకలో కేజీఎఫ్ 2ని పుష్ప 2 దాటేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.