Premalu Telugu OTT Release: ప్రేమలు ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్.. తెలుగు వెర్షన్ మరో ఓటీటీలోకి.. ఎక్కడ చూడాలంటే?
Premalu Telugu OTT Release: మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగు వెర్షన్ హాట్‌స్టార్ లో రావడం లేదా? తెలుగు వెర్షన్ హక్కులు మాత్రం మరో ఓటీటీ దక్కించుకుందా? తాజాగా అలాంటి వార్తలే వస్తున్నాయి.
Premalu Telugu OTT Release: మలయాళంలో ఈ ఏడాది రిలీజై రూ.135 కోట్లు వసూలు చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. మార్చి 29నే వస్తుందని భావించిన ఈ మూవీ ఇప్పుడు ఏప్రిల్ 12 అంటున్నారు. అయితే తాజాగా తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ లో మరో ట్విస్ట్ వచ్చింది.
ప్రేమలు తెలుగు వెర్షన్ ఆ ఓటీటీలో..
ప్రేమలు మూవీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుందని, అందులోనే మూడు భాషల్లోనూ మూవీ రాబోతుందని వార్తలు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుండటంతో మార్చి 29న ఓటీటీ రిలీజ్ వాయిదా వేశారు. ఏప్రిల్ 12న వస్తుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం హాట్‌స్టార్ లో కాకుండా ఆహా ఓటీటీలోకి రాబోతోందని తాజాగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా తెలుగు హక్కులను ఆహా సొంతం చేసుకుందట. నిజానికి అన్ని భాషల హక్కులు హాట్‌స్టార్ చేతికే చిక్కాయని అనుకున్నా.. చివరి నిమిషంలో సీన్లోకి ఎంటరైన నిర్మాత అల్లు అరవింద్ మూవీని తమ ఆహా వైపు లాక్కెళ్లినట్లు సమాచారం. దీనికోసం భారీ మొత్తం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.
ఫిబ్రవరి 9న మలయాళం వెర్షన్ రిలీజ్ కాగా.. మూవీ సూపర్ హిట్ కావడంతో మార్చి 8న తెలుగులోనూ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశాడు. ఇక్కడ కూడా హిట్ అయిన ప్రేమలు.. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది.
ఆహా ఓటీటీ దూకుడు
ఈ మధ్యే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ కోసం కూడా ఆహా ఓటీటీ భారీగానే ఖర్చు చేసింది. ఇక ఇప్పుడు సూపర్ హిట్ ప్రేమలు తెలుగు వెర్షన్ కోసం కూడా అదే స్థాయిలో చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ను కూడా ఆహా ఓటీటీ అదే ఏప్రిల్ 12వ తేదీనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు.
ఇక ప్రేమలు తెలుగు వెర్షన్ రూ.15 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ మలయాళ డబ్బింగ్ మూవీని బాగా ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ లవ్ స్టోరీకి తెలుగులో 90's వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య రాసిన డైలాగులు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ సినిమాపై నాగ చైతన్య, మహేష్ బాబు, రాజమౌళిలాంటి వాళ్లు కూడా ప్రశంసలు కురిపించారు.
కార్తికేయనే మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడంతో ప్రమోషన్లలో రాజమౌళి పాల్గొన్నాడు. తనకు సాధారణంగా లవ్ స్టోరీలు నచ్చకపోయినా.. ప్రేమలు మూవీ మాత్రం తెగ నచ్చేసినట్లు చెప్పాడు. అటు ఈ మధ్య కాలంలో ఓ సినిమా చూసి ఇంతగా ఎప్పుడూ నవ్వలేదంటే ప్రేమలు మూవీ రివ్యూ ఇచ్చాడు మహేష్ బాబు.