Premalu OTT Release Date: ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు!: మూడు భాషల్లో స్ట్రీమింగ్-premalu ott release date naslen gafoor mamitha baiju movie will stream on disney plus hotstar in malayalam telugu tamil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Premalu Ott Release Date: ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు!: మూడు భాషల్లో స్ట్రీమింగ్

Premalu OTT Release Date: ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు!: మూడు భాషల్లో స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 31, 2024 09:20 PM IST

Premalu Movie OTT Release Date: ఎట్టకేలకు ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా మూడు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగునూ అందుబాటులోకి వస్తుంది.

Premalu OTT Release Date: ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు: మూడు భాషల్లో స్ట్రీమింగ్
Premalu OTT Release Date: ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు: మూడు భాషల్లో స్ట్రీమింగ్

Premalu Movie OTT Release Date: మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు’ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు చాలా వేచిచూస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ రన్ కొనసాగుతుండటంతో ఓటీటీ రిలీజ్‍ను మేకర్స్ ఆలస్యం చేస్తూ వస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన ప్రేమలు భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. తెలుగులో మార్చి 8న ఈ చిత్రం కాగా.. ఇక్కడ కూడా వసూళ్లతో దుమ్మురేపింది. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ లవ్ కామెడీ మూవీలో నెస్లెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించారు.

ప్రేమలు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు. ఇక థియేట్రికల్ రన్ నెమ్మదించడంతో ఎట్టకేలకు ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ డేట్ డిసైడ్ అయ్యారు.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రేమలు సినిమా ఏప్రిల్ 12వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రావడం ఖరారైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఆరోజున హాట్‍స్టార్ ఓటీటీలో ఆ మూవీ స్ట్రీమింగ్‍కు రానున్నట్టు తెలుస్తోంది. హిందీ, కన్నడ వెర్షన్‍లపై అప్‍డేట్ లేదు.

మొత్తంగా ఏప్రిల్ 12వ తేదీ అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ప్రేమలు సినిమా మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో స్ట్రీమింగ్‍ రావడం దాదాపు ఖరారైంది. ఈ విషయంపై హాట్‍స్టార్‌ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

ప్రేమలు కలెక్షన్లు

మలయాళ మూవీ ప్రేమలు సినిమా రూ.5కోట్ల లోపు బడ్జెట్‍తోనే తెరకెక్కింది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఏకంగా సుమారు రూ.130 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాపీస్ వద్ద ఈ చిత్రం దుమ్మురేపింది. ప్రేమలు తెలుగు వెర్షన్‍కే సుమారు రూ.14కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ. హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ తెరకెక్కటంతో తెలుగులోనూ ప్రేమలు భారీ సక్సెస్ అయింది.

ప్రేమలు సినిమాలో హీరో నెస్లెన్, హీరోయిన్ మమితా బైజూ పర్ఫార్మెన్స్ అందరినీ మెప్పించింది. ఈ చిత్రాన్ని లవ్ ఎంటర్‌టైనింగ్‍గా తెరకెక్కించిన గిరీశ్‍పై ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల్ భార్గవన్, మాథ్యు థామస్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీమ్ కీలకపాత్రలు పోషించారు.

ప్రేమలు చిత్రాన్ని ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. ఆ మూవీకి విష్ణు విజయ్ సంగీతం అందించగా.. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రం ఆద్యంతం కామెడీతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో 90ఎస్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ రాసిన డైలాగ్స్ అదిరిపోయాయి.

ప్రేమలు స్టోరీ బ్యాక్‍డ్రాప్

లవ్‍లో ఫెయిల్ అవడంతో సచిన్ సంతోశ్ (నెస్లెన్ గఫూర్) యూకేకు వెళ్లాలనుకుంటాడు. అయితే, వీసా రిజెక్ట్ కావడంతో కేరళ నుంచి హైదరాబాద్‍కు వస్తాడు. తన స్నేహితుడు అమల్ డేవిస్‍(సంగీత్ ప్రతాప్)తో కలిసి ఉంటాడు. ఆ తర్వాత ఓ పెళ్లిలో రేణు రాయ్ (మమితా బైజూ)ను చూసి ప్రేమలో పడతాడు సచిన్. అతడికి ఆది (శ్యాం మోహన్) అడ్డుపడుతుంటాడు. మరి రేణుతో సచిన్ లవ్ సక్సెస్ అయిందా.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే ప్రేమలు మూవీ స్టోరీగా ఉంది.