OTT Action Film: తెలుగులో స్ట్రీమింగ్‍కు రెడీ అయిన హాలీవుడ్ క్రేజీ యాక్షన్ సినిమా.. ఎప్పుడంటే..-post apocalyptic action film furiosa a mad max saga to stream on jiocinema ott in telugu and other six languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Film: తెలుగులో స్ట్రీమింగ్‍కు రెడీ అయిన హాలీవుడ్ క్రేజీ యాక్షన్ సినిమా.. ఎప్పుడంటే..

OTT Action Film: తెలుగులో స్ట్రీమింగ్‍కు రెడీ అయిన హాలీవుడ్ క్రేజీ యాక్షన్ సినిమా.. ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 09, 2024 07:17 PM IST

Furiosa: A Mad Max Saga OTT Release Date: ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా సినిమా రెంట్ లేకుండా ఇండియాలో అందుబాటులోకి రానుంది. ఈ యాక్షన్ మూవీ తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమ్ కానుంది.

OTT Action Film: తెలుగులో స్ట్రీమింగ్‍కు రెడీ అయిన హాలీవుడ్ క్రేజీ యాక్షన్ సినిమా.. ఎప్పుడంటే..
OTT Action Film: తెలుగులో స్ట్రీమింగ్‍కు రెడీ అయిన హాలీవుడ్ క్రేజీ యాక్షన్ సినిమా.. ఎప్పుడంటే..

హాలీవుడ్ యాక్షన్ సినిమా ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా’ ఇండియాలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి రెంట్ లేకుండా అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కాగా.. డబ్బింగ్ వెర్షన్‍ల గురించి నేడు (అక్టోబర్ 9) కన్ఫర్మ్ చేసింది జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్.

ఏడు భాషల్లో..

క్రేజీ మూవీ ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా ఏడు భాషల్లో జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమ్ అవనుంది. అక్టోబర్ 23వ తేదీన ఈ చిత్రం ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓ ట్రైలర్ రిలీజ్ చేసి నేడు (అక్టోబర్ 9) వెల్లడించింది జియోసినిమా ఓటీటీ.

“వెస్ట్ ల్యాండ్ కోసం జరిగే ఎపిక్ యుద్ధాన్ని చూడండి. అక్టోబర్ 23 నుంచి ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా’ జియోసినిమా ప్రీమియమ్‍లో స్ట్రీమింగ్ అవనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠిలో ఈ మూవీ వస్తుంది” అని సోషల్ మీడియాలో నేడు జియోసినిమా పోస్ట్ చేసింది.

థార్ సహా మరిన్ని క్రేజీ క్యారెక్టర్లతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన క్రిస్ హేమ్స్‌వర్త్ సహా అన్య టేలర్ జాయ్ ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు. హేమ్స్‌వర్త్ నెగెటివ్ రోల్‍లో నటించారు. ఈ చిత్రంలో టామ్ బుర్కే, గార్డ్ షెవ్‍తోవ్, లాచీ హుమ్లే, జాన్ హావర్డ్, అంగస్ సాంప్సన్ కీరోల్స్‌లో కనిపించారు.

క్రేడ్ ఉన్నా డల్‍గా కలెక్షన్లు

ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా మూవీకి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. మ్యాడ్‍మాక్స్ ఫ్రాంచైజీలో ఐదో చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ ఏడాది ఫుల్ క్రేజ్ మధ్య మేలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్లు దక్కించుకోలేదు. 168 మిలియన్ డాలర్లతో ఈ మూవీని కెనడీ మిల్లెర్ మిచెల్, డొమైన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 170 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. క్రేజ్‍కు తగ్గట్టు వసూళ్లు రాలేదు.

కాగా, అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ హిందీ చిత్రం గతవారమే నేరుగా జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇద్దరు అబ్బాయి మధ్య ప్రేమతో డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రం వచ్చింది. హార్దిక్ గుజ్జర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సన్నీ సింగ్, ఆదిత్య సీల్, ప్రనౌత్ బహ్ల్ లీడ్ రోల్స్ చేశారు.

Whats_app_banner