OTT Hindi Movies: ఒకే రోజు డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి రానున్న మూడు హిందీ సినిమాలు.. థ్రిల్లర్, గే లవ్ మూవీ, ఎమోషనల్ డ్రామా-ctrl amar prem ki prem kahani and the signature movies direct ott streaming in this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Hindi Movies: ఒకే రోజు డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి రానున్న మూడు హిందీ సినిమాలు.. థ్రిల్లర్, గే లవ్ మూవీ, ఎమోషనల్ డ్రామా

OTT Hindi Movies: ఒకే రోజు డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి రానున్న మూడు హిందీ సినిమాలు.. థ్రిల్లర్, గే లవ్ మూవీ, ఎమోషనల్ డ్రామా

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 02, 2024 12:22 PM IST

OTT Hindi Direct Movies: ఈ వారం ఓటీటీల్లోకి నేరుగా మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీలతో ఈ చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. ఓ మూవీ సైబర్ థ్రిల్లర్ కాగా.. మరొకటి గే లవ్ స్టోరీతో వస్తోంది. ఇంకో చిత్రం కూడా రానుంది. ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానున్నాయంటే..

OTT Direct Movies: ఒకే రోజు డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి రానున్న మూడు హిందీ సినిమాలు.. థ్రిల్లర్, గే లవ్ మూవీ, ఎమోషనల్ డ్రామా
OTT Direct Movies: ఒకే రోజు డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి రానున్న మూడు హిందీ సినిమాలు.. థ్రిల్లర్, గే లవ్ మూవీ, ఎమోషనల్ డ్రామా

ఈ అక్టోబర్ తొలి వారంలో ఏకంగా మూడు హిందీ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‍కు రానున్నాయి. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాయి. ట్రైలర్లతోనే ఈ చిత్రాలు క్యూరియాసిటీని పెంచాయి. అనన్య పాండే నటించిన థ్రిల్లర్ మూవీ ‘కంట్రోల్’ కూడా ఇందులో ఉంది. మరో రెండు చిత్రాలు కూడా స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి నేరుగా రానున్న మూడు హిందీ చిత్రాలు ఏవంటే..

కంట్రోల్

కంట్రోల్ సినిమా అక్టోబర్ 4వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ప్రధాన పాత్ర పోషించారు. బాయ్ ఫ్రెండ్‍తో బ్రేకప్ అయిపోయాక ఏఐ ప్లాట్‍ఫామ్‍లో అవస్థి (అనన్య) లాగిన్ అవుతుంది. ఏఐ మనిషితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఏఐ మనిషి చేతుల్లోకి అనన్య కంట్రోల్ వెళ్లిపోతుంది. ఇలా ఇంట్రెస్టింగ్ పాయింట్‍తో సైబర్ థ్రిల్లర్ మూవీగా కంట్రోల్ వస్తోంది.

కంట్రోల్ చిత్రానికి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించారు. ఏఐ టెక్నాలజీ, సోషల్ మీడియా మనుషులను ఎలా కంట్రోల్ చేస్తుందనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ క్యూరియాసిటీ పెంచింది. అనన్యతో పాటు విహాన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశారు. అక్టోబర్ 4 నుంచి ఈ సినిమాను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ

ఇద్దరు అబ్బాయిల మధ్య లవ్ స్టోరీతో అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ చిత్రం వస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 4వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ గే లవ్ స్టోరీ చిత్రంపై ట్రైలర్‌ తర్వాత బజ్ ఏర్పడింది. ఈ సినిమాకు హార్దిక్ గుజ్జర్ దర్శకత్వం వహించారు.

అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ చిత్రంలో సన్నీ సింగ్, ఆదిత్య సీల్, ప్రనౌత్ బహ్ల్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రథ్ గజ్జర్, పూన్ ష్రాఫ్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రసాద్ సస్థే సంగీతం అందించారు. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ మూవీ అక్టోబర్ 4వ తేదీన జియో సినిమా ఓటీటీలో అడుగుపెట్టనుంది.

ది సిగ్నేచర్

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషించిన ‘ది సిగ్నేచర్’ చిత్రం అక్టోబర్ 4వ తేదీన జీ5 ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ ఎమోషనల్ డ్రామా చిత్రానికి గజేంద్ర అహిరే దర్శకత్వం వహించారు. మరాఠీ మూవీ ‘అనుమతి’కి ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

తీవ్ర అనారోగ్యానికి గురై తన భార్య ఆసుపత్రి పాలవడంతో ఓ వృద్ధుడి జీవితం మారిపోతుంది. ఆమెను కాపాడుకునే క్రమంలో ఆర్థికంగా, ఎమోషనల్‍గా చాలా సవాళ్లను ఎదుర్కొనడం చుట్టూ సిగ్నేచర్ మూవీ సాగుతుంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్‌తో పాటు మహిమ చౌదరి, రణ్‍వీర్ షోరే, అన్నూ కపూర్, మనోజ్ జోషి, నీనా కులకర్ణి కీలకపాత్రలు పోషించారు. అనుపమ్ ఖేర్ ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించారు. జీ5లో అక్టోబర్ 4 నుంచి ది సిగ్నేచర్ సినిమాను చూడొచ్చు.