OTT Thriller Movie: ఓటీటీలోకి నేరుగా రానున్న థ్రిల్లర్ మూవీ.. ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
CTRL OTT Thriller Movie: కంట్రోల్ సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఇంటర్నెట్ ప్రపంచం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే, విహాన్ సామ్రాట్ ప్రధాన పాత్రల్లో కంట్రోల్ (CTRL) చిత్రం వస్తోంది. థ్రిల్లర్ సినిమాలకు పాపులర్ అయిన విక్రమాదిత్య మోత్వానే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ, సోషల్ మీడియా అంశాలతో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకే రానుంది. కంట్రోల్ సినిమా ట్రైలర్‌ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ నేడు (సెప్టెంబర్ 25) తీసుకొచ్చింది.
థ్రిల్లింగ్‍గా ట్రైలర్
కంట్రోల్ చిత్రంలో నెల్లా అవస్థిగా అనన్య పాండే, జో మస్కరేనస్ పాత్రలో విహాన్ సామ్రాట్ నటించారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చూసుకొని వారిద్దరూ ప్రేమలో పడతారనే విషయం ట్రైలర్లో ఉంది. అయితే వారిద్దరూ ఓ దశలో బ్రేకప్ చెప్పుకుంటారు. ఈ తరుణంలో ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‍ఫామ్‍లోకి అవస్థి (అనన్య పాండే) లాగిన్ అవుతారు. అందులోని ఓ ఏఐ మనిషితో పరిచయం ఏర్పరుచుకుంటారు. అప్పటి నుంచి తన జీవితాన్ని, సంతోషాన్ని ఆ ఏఐ మనిషి కంట్రోల్ చేస్తున్నారని అవస్థి అనడం ట్రైలర్లో ఉంది.
మాయం చేసిన ఏఐ
సోషల్ మీడియాలో నెటిజన్ల సమాచారం బయటికి రావడం, ట్రోలింగ్ ఇలా చాలా అంశాలు ఈ ట్రైలర్లో ఉన్నాయి. తన మాజీ బాయ్‍ఫ్రెండ్ జోను తీసేయాలనుకుంటున్నా, చేయగలవా అని ఏఐలో అనన్య అడుగుతారు. ఆ తర్వాత జో మిస్ అవుతాడు. దీంతో అతడు ఏమయ్యారని అవస్థి వెతుకుతుంది. జో కనిపించడం లేదని ఏఐని అడిగితే.. నువ్వు అడిగింది ఇదే కదా అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జో ఏమయ్యాడు? అవస్థి ఈ పరిస్థితి నుంచి బయటపడిందా? ఆ ఏఐ ప్లాట్‍ఫామ్ ఏం చేసిందనేది ఈ కంట్రోల్ సినిమాలో ఉండనున్నాయి.
కంట్రోల్ ట్రైలర్ ఆసాంతం ఇంట్రెస్టింగ్‍గా సాగింది. టెక్నాలజీ మనుషులను ఎలా కంట్రోల్ చేస్తోందని, సోషల్ మీడియా ప్రభావాన్ని కూడా డైరెక్టర్ విక్రమాదిత్య చూపించారు. ఏఐలోని మనిషితో పరిచయం ఆసక్తిగా ఉంది. మొత్తంగా ట్రైలర్‌తో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది.
స్ట్రీమింగ్ డేట్
కంట్రోల్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 4వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికైతే ట్రైలర్ హిందీలో వచ్చింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 4 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు.
కంట్రోల్ చిత్రంలో అనన్య పాండే, విహాన్‍తో పాటు దేవికా వత్స, కామాక్షి భట్, సచిత త్రివేది, అపర్‌శక్తి ఖురానా, సమిత్ గంభీర్, రావిశ్ దేశాయ్ కీలకపాత్రలు పోషించారు. సాఫ్రాన్ మ్యాజిక్ వర్క్స్ పతాకంపై నిఖిల్ ద్వివేది, ఆర్య మీనన్ ఈ మూవీని నిర్మించారు.